గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజులా దేవి
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు
మంజుల దేవి ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డాక్టర్
నరసింహంని సభ్యులు మంగళవారం కలిశారు. రాష్ట్రంలో నర్సుల యొక్క ఇబ్బందులు
అత్యవసరముగా కల్పించాల్సిన అవసరం ఉన్న సదుపాయాలు గూర్చి పూర్తి వివరణతో ఒక
వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో
ముగ్గురు తో మాత్రమే నడుస్తున్న సెంటర్స్ లో ఇంకొక స్టాఫ్ నర్సు ని అపాయింట్
చేయాలని, నాలుగు నెలలుగా ఏర్పడిన మూడు కొత్త హాస్పిటల్స్ లో జీతాలు రాలేదని
వివరించారు. ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అసోసియేషన్ ఎన్నికల తేదీని వెంటనే ప్రకటించి
డి.యం.ఇ నుంచి ఇంకొక గ్రూప్ వన్ ఆఫీసర్ ని ఎలక్షన్ అధికారిగా నియమించాలని
కోరారు. నర్సెస్ యొక్క ప్రమోషన్ వివరాలు తెలియజేస్తూ టీచింగ్ స్టాఫ్ యొక్క
ప్రమోషన్స్, గ్రేడ-2, గ్రేడ్-1 నర్సింగ్ సూపరింటెడెంట్ ప్రమోషన్స్, స్టాఫ్
నర్స్, హెడ్ నర్స్ యొక్క ప్రమోషన్స్ వెంటనే విడుదల చేయాలని కోరామన్నారు. వీరు
అందజేసిన వినతిపత్రం స్వీకరించిన డీఎంఈ డాక్టర్ నరసింహ పరిశీలించి వారు
సానుకూలంగా స్పందించి నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ నర్స్
రోజ్ కుమారి, అరుణ, లక్ష్మీ తులసి, స్వర్ణలత, పెర్సి, స్టాఫ్ నర్స్ కళ్యాణి,
సబ్నా అనుపమ, స్రవంతి, అంజలి, అరుణ, తదితరులు పాల్గొన్నారు.