దళితుల అభివృధ్దికి జగన్ అనేక పధకాలు అమలు చేస్తున్నారు
వాటిని ప్రజలలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉంది
తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ఇతర పక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని
ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి
ఇందుకు ప్రధాన మీడియాతోపాటు డిజిటల్,సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లను
వినియోగించుకోవాలి
దేశంలో మరే రాష్ర్టంలో లేని విధంగా వైయస్ జగన్ ఎస్సీలకు అత్యధిక ప్రాధాన్యం
ఇస్తున్నారు
దళిత కుటుంబాలకు నాలుగేళ్లలో 53 వేల కోట్ల రూపాయలు పైగా లబ్ది
ఆదిమూలపు సురేష్ పై టిడిపి శ్రేణులు దాడి చేసింది కాక తిరిగి దాదాపు 20 మంది
టిడిపి రాష్ర్ట నేతలు ఎదురుదాడి చేస్తూ విమర్శలకు దిగడం దారుణం
దళితులు చంద్రబాబుకు రానున్న ఎన్నికలలో తగిన బుధ్ది చెబుతారు
రాష్ర్ట డిప్యూటి ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి,మంత్రులు, మేరుగు నాగార్జున,
ఆదిమూలపు సురేష్, పినిసే విశ్వరూప్
తాడేపల్లిలో జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ముఖ్యనేతల సమావేశం
హాజరైన ఎస్సీ మంత్రులు,పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు,
జడ్ పి ఛైర్మన్లు, ఇతర నేతలు
గుంటూరు : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగానికి చెందిన
ముఖ్యనేతలు,ప్రజాప్రతినిధులు తాడేపల్లిలో సోమవారం సమావేశమయ్యారు. ఈ
సమావేశానికి రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి కే.నారాయణ స్వామి, రాష్ర్ట మంత్రులు
మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, పినిసే విశ్వరూప్, పార్టీ రాష్ర్ట ప్రధాన
కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ అనుభంధ సంఘాల రాష్ర్ట కోఆర్డినేటర్
చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పార్లమెంట్ సభ్యులు, పలువురు శాసనసభ్యులు,శాసనమండలి
సభ్యులు,పార్టీ జిల్లా ఎస్సీ విభాగాల అధ్యక్షులు,వివిధ నగరాల మేయర్లు,డిప్యూటి
మేయర్లు,నామినేటెడ్ పదవులు పొందిన ఎస్సీ నేతలు హాజరయ్యారు. ప్రధానంగా జగన్
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి దళితులను రాజకీయంగా, ఆర్దికంగా,
విద్యాపరంగా సామాజికంగా పైకి తీసుకువచ్చేందుకు అమలు చేస్తున్న పధకాలు,
తీసుకున్న నిర్ణయాలు, వాటిని ప్రజలలోకి తీసుకువెళ్లి ఆయా వర్గాలను
చైతన్యపరచటం, తెలుగుదేశం పార్టీ,చంద్రబాబు,పచ్చమీడియా ఇతర పక్షాలు దళితులపై
దాడులంటూ దుష్ప్రచారం చేయడాన్ని ఎలా తిప్పికొట్టాలి. చంద్రబాబు హయాంలో
దళితులను ఏ విధంగా అవమానాలకు గురిచేసింది. దాడులు,అత్యాచారాలకు
పాల్పడింది.దళితుల భూములను కబ్జాచేసింది. ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని
కోరుకుంటారా అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు,ఇటీవల దళితులను అవమానపరిచే విధంగా
లోకేష్ చేసిన వ్యాఖ్యలు,మంత్రి ఆదిమూలపు సురేష్ పై చంద్రబాబు సమక్షంలో జరిగిన
దాడి తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యంగా వైయస్ జగన్ కు,వైయస్సార్ కాంగ్రెస్
పార్టీకి పెట్టని కోటగా ఉన్న దళితులకు అందుతున్న ప్రయోజనాలను ప్రజలలోకి
తీసుకువెళ్తూ రానున్న ఎన్నికలలో తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం
ఎగురవేసేలా చేయాలని పార్టీ ఎస్సీ ముఖ్యనేతలు పిలుపు ఇచ్చారు.
ఈ సమావేశానికి రాష్ర్ట సాంఘిక సంక్షేమ శాఖమంత్రి మేరుగు నాగార్జున అధ్యక్షత
వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను నిరంతరం అవమానిస్తున్న
చంద్రబాబును రాజకీయంగా అంతం చేయడమే మా ధ్యేయం అని అన్నారు. చంద్రబాబు దళితులను
ఎంతగా అపహస్యం చేశాడు. ఎంతగా మోసం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు దళితులను ఎలా
అవమానించాడు. ఇవన్నీదృష్టిలో పెట్టుకుని చంద్రబాబు అనే దుష్టుడ్ని పల్లెల్లోకి
రానీవ్వకూడదు అని అన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానంలో ఇంతకుముందు ఇప్పుడు ఎవరు
పనిచేస్తున్నారు. గమనించాలన్నారు. మా కమ్యూనిటీస్ ని చంద్రబాబు ఏ విధంగా
అపహస్యం చేశారో అందరికి తెలుసన్నారు. అందులో కుట్ర,దగా ఉందన్నారు. చంద్రబాబు
అధికారంలో ఉండగా దళితులపై దాడులను ప్రోత్సహించారన్నారు. నేడు కూడా దళితులను
వాడుకునేందుకు కపటనాటకాలు ఆడుతున్నారన్నారు. రాష్ర్టంలో శ్రీ వైయస్ జగన్ గారు
ముఖ్యమంత్రి అయ్యాక అంబేద్కర్ వాదాన్ని ఏ విధంగా భుజాన వేసుకున్నారు అనేది
ప్రతి దళిత సోదరుడికి తెలుసున్నారు. మా అందరి అభిప్రాయం అంబేద్కర్ ఆలోచనా
విధానం వర్దిల్లాలని, ఆ దిశగా ముందుకు వెళ్తున్న శ్రీ వైయస్ జగన్ గారికి అండగా
నిలబడాలనేది మా ద్యేయం అన్నారు. ఈ విషయంలో దళితులంతా ఒక్కటే అన్నారు.
దళితులంతా కలసి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మా కులాలపై పూర్తి అవగాహనతో
జగన్ గారు ముందుకు వెళ్తున్నారన్నారు. చంద్రబాబు కుట్రల మాయలో పడకుండా
దళితులంతా వైయస్ జగన్ కు అండగా నిలబడాలని కోరారు. చంద్రబాబు నైజం కొనడం,అమ్మడం
అన్నారు. అవసరమైతే దళితులను తన్నడానికి కూడా చంద్రబాబు వెనకాడడనే విషయాన్ని
గుర్తించాలన్నారు. జగన్ గారిని అభాసుపాలు చేయడానికి చంద్రబాబు పన్నుతున్న
కుట్రల పట్ల దళితులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చంద్రబాబు కుయుక్తుల
మాయలో పడితే మనకు పుట్టగతులు ఉండవని వివరించారు. దళితుల ఆస్ది,డబ్బు,హక్కులను
హరించిన చంద్రబాబు తిరిగి కొత్త నాటకాలకు రెడీ అవుతున్నారని అన్నారు. దళితులను
అన్ని విధాలుగా ఉన్నతస్దానానికి తీసుకువచ్చే విధంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి
జగన్ కు దళితులంతా అండగా నిలవాలన్నారు.
రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి శ్రీ కే.నారాయణస్వామి మాట్లాడుతూ….
చంద్రబాబూ..లోకేష్…మీకు తగిన విధంగా బుద్దిచెప్పేది దళితులు మాత్రమేనని
అన్నారు. మీకు కులపిచ్చి,మతపిచ్చి,పార్టీ పిచ్చి… మీ పచ్చపత్రికలు సైతం మీ
కులానికి సంబంధించినవి వాటిని దుష్ప్రచారానికి వాడుతున్నారనే విషయం ప్రజలకు
తెలుసన్నారు. ఆదిమూలపు సురేష్ గారిపై దాడి చేసింది గాక,టిడిపిలోని దళితులతో
అబద్దాల చెప్పిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో నాడు ఎన్టీఆర్ ను సైతం మాట్లాడనీయకుండా చేసిన యనమల లాంటి వారు సైతం
విమర్శించడం హాస్యాస్పదం అన్నారు. రిజర్వ్ నియోజకవర్గాలలో ఒక్క స్దానం కూడా
గెలుచుకునే సత్తా తెలుగుదేశం పార్టీకి లేదన్నారు. అచ్చెన్నాయుడు లాంటివారు
శ్రీ వైయస్ జగన్ గారిని తిట్టడాన్ని ప్రజలు సహించరన్నారు. ఇలాంటి వారందరిని
దళితులు ఎదిరించి నిలబడాలన్నారు. ముఖ్యంగా టిడిపి వాళ్లు దుష్ప్రచారానికి
ముందుంటున్నారని సురేష్ పై దాడి చేసింది గాక 18 మందితో మీడియాలో విమర్శలకు
దిగారన్నారు. శ్రీ వైయస్ జగన్ గారు అన్ని జాతుల సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి
అని ఆయనకు అండగా నిలబడాల్సిన బాధ్యత దళితులందరిపై ఉందన్నారు.
ఆదినారాయణరెడ్డి,దివాకరరెడ్డి లాంటి వాళ్లు దళితులు… ప్రలోభాలకు లొంగి ఓట్లు
వేస్తారని అవమానించేవిధంగా మాట్లాడారని వారికి అడ్రస్ లేకుండా చేసి ప్రజలు
తగిన బుద్ది చెప్పారన్నారు. రాష్ర్టంలోని ప్రతి దళిత కుటుంబానికి లక్షలాది
రూపాయలు సంక్షేమ పధకాల రూపంలో శ్రీ వైయస్ జగన్ అందించి వారికి ఆర్దికంగా
చేదోడుగా నిలిచారన్నారు.
రాష్ర్ట మంత్రి శ్రీ పినిసే విశ్వరూప్ మాట్లాడుతూ….29 ఎస్సిఎస్టీ
నియోజకవర్గాలు ఉంటే 28 అసెంబ్లీ నియోజకవర్గాలలో వైయస్సార్ సిపి విజయం
సాధించిందన్నారు.ఈ వర్గాల అండా.. దండా శ్రీ వైయస్ జగన్ గారికే ఉందన్నారు. గత
ఎన్నికలలో ఏ విధంగా అయితే దళిత వర్గాలన్నీ కూడా వైయస్సార్ కాంగ్రెస్
పార్టీకి,శ్రీ వైయస్ జగన్ గారికి మధ్దతు పలికాయో 2024 ఎన్నికలలో సైతం అంతకంటే
మెరుగైన రీతిలో మద్దతు పలికేందుకు 29 ఎస్సిఎస్టి స్దానాలను పార్టీ
గెలుచుకునేవిధంగా దళితులు మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. ఇందుకు
సంబంధించి కార్యాచరణను పార్టీ సిధ్దం చేస్తోందన్నారు. అదేరీతిలో గత నాలుగు
సంవత్సరాల కాలంలో దళితుల అభివృధ్దికి అమలు చేస్తున్న
పధకాలు,వైద్యం,విద్యాపరంగా ప్రోత్సహించేలా నాడు-నేడు కార్యక్రమాలు దళితులను
దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. విద్యాకానుక,వసతిదీవెన లాంటి
పధకాలు కూడా అలాంటివే అన్నారు. విదేశీ విద్య మరింత మెరుగ్గా అమలు
చేస్తున్నారున్నారు. ఎస్సీ కార్పోరేషన్ రుణాలు ఇతర పధకాలు రద్దు చేశారని
టిడిపి దుష్ప్రచారం చేస్తోందన్నారు. అయితే చంద్రబాబు హయాంలో ఆయా పధకాలలో
అవినీతి,కుంభకోణాలు చోటుచేసుకున్నాయన్నారు. అవినీతి రహితంగా ఆ పధకాలు నేడు
అమలు చేయడం జరుగుతుందన్నారు.
రాష్ర్ట మున్సిపల్ శాఖమంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ
రాష్ర్టంలో దళితుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేవిధంగా ఎటువంటి చర్యలు
చేపట్టాలనే దిశగా ఎస్సీ నేతల సమావేశంలో చర్చించామని వివరించారు. చంద్రబాబు
దళితులను కేవలం ఎన్నికలకోసం ఓటుబ్యాంకుగా వాడుకున్నారని అన్నారు. చంద్రబాబు
హయాంలో దళితులకోసం అంటూ పధకాలు ప్రవేశపెట్టి వాటిలో పెద్దఎత్తున అవినీతికి
పాల్పడ్డారన్నారు. శ్రీ వైయస్ జగన్ దళితులకు సంబంధించి చేపట్టిన పధకాలలో
ఎటువంటి అవినీతికి తావులేకుండా వాటిని అమలు చేయడం జరుగుతుందన్నారు. అయితే
చంద్రబాబుతోపాటు ప్రతిపక్షాలు, పలు పచ్చమీడియా పత్రికలు,ఛానల్స్ లో శ్రీ
వైయస్ జగన్ గారి హయాంలో దళితులకు అన్యాయం జరుగుతుందంటూ అదే పనిగా దుష్ప్రచారం
చేస్తున్నారన్నారు. వాటిని పార్టీ నేతలంతా తిప్పికొట్టాలని కోరారు. ప్రజలు
చంద్రబాబు కుట్రలను కుయుక్తులను నమ్మే స్ధితిలో లేరన్నారు. ముఖ్యంగా వైయస్సార్
సిపి ప్రభుత్వం మూలసూత్రాలు ఏవైతే ఉన్నాయో పారదర్శకత,జవాబుదారీతనం,సుపరిపాలనపై
ప్రజలలోకి తీసుకువెళ్తామన్నారు. దళితకుటుంబాలన్నీ కూడా ప్రస్తుతం అందుతున్న
సంక్షేమ పధకాలు కొనసాగాలన్నా,దళిత పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే శ్రీ వైయస్
జగన్ ముఖ్యమంత్రిగా మరింతకాలం కొనసాగాల్సిన అవసరం ఉందనే విషయాన్ని
గుర్తించాలని కోరారు. నాలుగు సంవత్సరాల కాలంలో దళిత కుటుంబాలకు 53 వేల కోట్ల
రూపాయలకు పైగా లబ్ది చేకూరిందన్నారు.
దళితులను అవహేళన చేసే విధంగా చంద్రబాబు,లోకేష్ లు మాట్లాడుతున్నారని
విమర్శించారు. వారి విమర్శలపై చంద్రబాబుకు నిరసన తెలియచేద్దామని ప్రయత్నిస్తే
నాపై రాళ్ల దాడి చేసి తిరిగి తనపైనే టిడిపినేతలు దుష్ప్రచారానికి ఒడిగట్టారని
తెలిపారు. తన రక్తం కళ్ల చూసే విధంగా తన మనోభావాలను దారుణంగా
దెబ్బతీశారన్నారు. చంద్రబాబు తన కార్యాలయం ఎదుట ఎటువంటి పర్మిషన్ లేకుండా
టిడిపి నేతలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారన్నారు. ఆదిమూలంకు మూలాలు లేవంటూ
మాట్లాడటం దళితులకు మూలాలు లేవని అవమానించడమే అని అన్నారు. ఈ అంశంపై ప్రతిచోట
చంద్రబాబుకు నిరసన తెలియచేసి తగిన విధంగా బుధ్ది చెబుతామన్నారు.
పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ
….వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో శ్రీ వైయస్ జగన్ మినహా మిగిలిన వారందరూ
కార్యకర్తలేనని అన్నారు. శ్రీ వైయస్ జగన్ గారితో కలసి ఎవరి బాధ్యతలు వాళ్ళు
సక్రమంగా నిర్వర్తిస్తే పార్టీ మరింతగా బలోపేతం అవుతుందన్నారు. శ్రీ వైయస్
జగన్ గారి ఆలోచనలకు అనుగుణంగా కర్తవ్యాలను నెరవేర్చాలన్నారు. ఎస్సీ నేతల
సమావేశంలో అందరి నేతల అభిప్రాయాలను సూచనలను పరిగణినలోనికి తీసుకుంటామన్నారు.
శాచ్యూరేషన్ బేసిస్ పై అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం చేయాల్సినవన్నీ
చేస్తుండటం వల్ల రాజకీయం,రాజకీయనేతల పాత్ర మారిపోయిందన్నారు. గతంలో ఉన్న
పరిస్దితిని బ్రేక్ చేసిన ఘనత శ్రీ వైయస్ జగన్ గారిదన్నారు. మన ప్రమేయం
లేకుండా జరిగిపోతుందని నేతలు భావిస్తున్నారు. ఇంకా చాలా డౌట్లు అటు నేతలలో,
కార్యకర్తలలో ఉన్నాయన్నారు. అయితే శ్రీ వైయస్ జగన్ గారు అమలు చేస్తున్నపధకాల
వల్ల ఎస్సి,ఎస్టి,బిసి,మైనారిటీ వర్గాలతోపాటు అగ్రకులాల్లోని పేదలలో
ఆత్మవిశ్వాసం పెంపొందిందన్నారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలు,కార్యకర్తలు
గుర్తించి పనిచేయాలన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ఎక్కడికక్కడ
తిప్పికొట్టాలన్నారు. శ్రీ వైయస్ జగన్ గారు అమలు చేస్తున్న పధకాలు షార్ట్
టర్మ్ బెనిఫిట్ కాదు లాంగ్ టర్మ్ లో మన భవిషత్తు మరింత మెరుగ్గా మారుతుందనే
విషయాన్ని లబ్దిదారులు గుర్తించేవిధంగా చైతన్యం తేవాలన్నారు.
ముఖ్యంగా మంత్రి ఆదిమూలపు సురేష్ పై చంద్రబాబు సమక్షంలో జరిగిన రాళ్ల దాడి
విషయంలో టిడిపి ఓ కార్పోరేట్ స్దాయిలో దుష్ప్రచారానికి ఒడిగట్టిందన్నారు.
అయితే ఈ విషయంలో వైయస్సార్ సిపి పార్టీ నేతలు,ప్రజాప్రతినిధులు చంద్రబాబు
కుట్రలను,కుయుక్తులను మరింతగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఓ వైపు
ప్రభుత్వం దళితుల అభ్యున్నతికోసం చేస్తున్న విధానాలను,పధకాలను వివరిస్తూనే
ప్రతిపక్షాల కుట్రలను సైతం తిప్పికొట్టాలన్నారు. ఇందుకు ప్రధాన మీడియాతోపాటు
డిజిటల్,సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలను వినియోగించుకోవాలన్నారు.
ఎస్సీ సెల్ రాష్ర్ట అధ్యక్షులు శ్రీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ
చంద్రబాబు రాష్ర్టానికి పట్టిన శని.అభివృద్దిని అడ్డుకోవడమే కాకుండా
రాష్ర్టాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేశారన్నారు.దళితులు వైయస్సార్ సిపికి
ఎల్లప్పుడూ తరగని ఆస్ది అని తెలియచేశారు.
ఎస్సీ సెల్ మరో రాష్ర్ట అధ్యక్షులు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ దళితులు
విద్య,వైద్య పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చేదన్నారు. శ్రీ వైయస్
జగన్ గారు ప్రవేశ పెట్టిన అమ్మఒడి,నాడు-నేడు వంటి పధకాల వల్ల వారిలో
ఆత్మవిశ్వాసం పెంపొందిందని అన్నారు.
ఎస్సీ సెల్ రాష్ర్ట అధ్యక్షులు,ఎంపీ శ్రీ నందిగమ్ సురేష్ మాట్లాడుతూ దళితులను
అన్ని విధాలుగా అవమానించిన చంద్రబాబుకు ఎన్నికలలో తగిన విధంగా బుద్ది చెప్పినా
ఆయన తీరు మారలేదని విమర్శించారు.రానున్న ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయంగా
అంతర్ధానం అవుతారని అన్నారు.
ఎస్సీ సెల్ రాష్ర్ట అధ్యక్షులు జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ దళితులకు
సంబంధించి అంబేద్కర్ ఆలోచనా విధానంతో ముందుకు వెళ్తున్న శ్రీ వైయస్ జగన్ కు
ప్రతి దళితుడు అండగా నిలవాలని కోరారు.
సమావేశం నిర్వహణను పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు,శాసనమండలి సభ్యులు
శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షించారు.