పొందూరు : రాష్ట్రంలో హిందూ వ్యతిరేక కార్యకలాపాలతో వైకాపా ప్రభుత్వంపై
ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే శారద
పీఠాధిపతి స్వరూపానంద ప్రభుత్వంపై మండిపడుతున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని
ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద
సరస్వతి ఓ ప్రకటనలో విమర్శించారు. వీవీఐపీ భక్తుల సేవల్లో తరిస్తున్న సింహాచలం
దేవస్థానం అధికారుల నిర్వాకం వల్ల చందనోత్సవాల్లో సామాన్య భక్తులు తీవ్ర
ఇబ్బందులు పడ్డారని, దీనికి ప్రభుత్వం, అధికారులే కారణమని మండిపడ్డారు. దీనిపై
స్వరూపానందస్వామి ఆగ్రహం వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. వైసీపీ
పెద్దలు, ముఖ్యమంత్రి హిందూ వ్యతిరేక విధానాలతో ప్రజల్లో వ్యతిరేకత
పెరుగుతోందని గమనించి ఇలా చేశారే తప్ప నిజాయతీ లేదన్నారు. దేవాలయాలపై దాడులు
జరిగినప్పుడు, దేవాలయాల భూములను వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నప్పుడు
స్వరూపానంద ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు.