దేశం నలుమూలల నుండి తరలి రానున్న ప్రముఖులు, పీఠాధిపతులు, అఘోరాలు * ఈ మహా
చండీ యాగాలు జయప్రదం చెయ్యండి * మాస్ట్రో గజల్ శ్రీనివాస్ పిలుపు
విజయవాడ పశ్చిమ : శ్రీ దేవీ కరుమారి అమ్మన్ శక్తి పీఠం వద్ద జరగనున్న
మహోన్నతమైన సహస్ర చండీ యాగపూర్వక కుంభాభిషేకం కార్యక్రమంలో ప్రతిఒక్కరు
పాల్గొని జయప్రదం చెయ్యాలని మాస్ట్రో గజల్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.శనివారం
ఉదయం శ్రీ దేవీ కరుమారి అమ్మన్ శక్తి పీఠం వద్ద 72 అడుగులు ఎత్తు అస్టాదశభుజ
మహా చండీ విగ్రహం అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. గజల్ శ్రీనివాస్,
ఆంధ్రప్రదేశ్ పైబర్ నెట్ చైర్మన్,ఉత్సవ కమిటీ అధ్యక్షులు పూనూరు గౌతమ్
రెడ్డి,వైసీపీ నగర మాజీ మహిళా కన్వీనర్ లఖంరాజు సునీత, మాజీ కార్పొరేటర్ యాదల
శ్రీనివాసరావు, పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు తదితరులు చేతులు మీదుగా
పూజాదికాలు నిర్వహించారు. మిల్క్ ఫ్యాక్టరీ వద్దున్న సి వి ఆర్ ప్లై ఓవర్
బ్రిడ్జి పక్కనున్న శ్రీ దేవీ కరుమారి అమ్మన్ శక్తి పీఠం వద్ద ఈ నెల 27 నుండి
మే 3 తేదీ వరకు జరగనున్న సహస్త్ర చండీ యాగం నిర్వహణలో భాగంగా మహా చండీ మట్టి
విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న దరిమిలా అన్ని ఏర్పాట్లు పూర్తి
కానున్నాయి.మాస్ట్రో గజల్ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో జరుగుతున్న ఈ వేడుకల్లో
కేంద్ర మంత్రులు, ఆధ్యాత్మిక వేత్తలు, పీఠాధిపతులు,
అఘోరాలు,పాల్గొంటున్నారని,పవిత్ర గంగా పుష్కరాల శుభ ఘడియల్లో జరుగుతున్న ఈ
వేడుకల్లో ప్రతిఒక్కరు పాల్గొని జయప్రదం చెయ్యాలని మాస్ట్రో గజల్ శ్రీనివాస్
పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కరుమారి అమ్మన్ ట్రస్ట్ కోశాధికారి
జ్ఞానేశ్వర్, సత్య శ్రీహరి, శంకర రెడ్డి,సభ్యులు మహిళా భక్తులు తదితరులు
పాల్గొన్నారు.