విజయవాడ : అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ
జులై 1న వైద్యరంగంలో నిష్ణాతలైన ప్రముఖ వైద్యులను విశిష్ట వైద్య సేవా
పురస్కారాలతో సత్కరించాలని సంకల్పించింది. అందుకు సంబంధించిన విశిష్ట
వైద్యసేవా పురస్కారాల కార్యక్రమ లోగోను విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
ఆమె ఛాంబర్లో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ
ప్రాణదాతలైన వైద్యుల సేవల్ని గుర్తించి వారికి పురస్కారాలివ్వడం మంచి
శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా మల్లెతీగ వైద్య ప్రత్యేక సంచికను ప్రచురించి
అదే రోజు ఆ వేదికపై ఆవిష్కరింపజేయడం ఎంతో బాధ్యతాయుతమైన సంకల్పమని, సామాజిక
బాధ్యతతో గొప్ప కార్యక్రమం చేస్తున్న మల్లెతీగకు, జర్నలిస్టుల బృందానికి
అభినందనలు అన్నారు మేయర్. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల బృందం కలిమిశ్రీ,
యేమినేని వెంకటరమణ, కుర్రా సురేష్ బాబు, వల్లూరు ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.