అమరావతి : రాష్ట్ర విభజనకు సంబధించిన అపరిష్కృత అంశాల్లో కొన్ని కొలిక్కి
వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్. జవహర్‌రెడ్డి తెలిపారు.
రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళతారని, ఈ సమావేశం కోసం ఆయన
విదేశీ పర్యటన కూడా వాయిదా వేసుకున్నారని సీఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు.
మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర
కార్యదర్శుల సమావేశానికి బుధవారం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించామని, తమ
పర్యటనలో సీఎం జగన్ కూడా ఉండాలని కోరుతున్నామన్నారు. రెండ్రోజుల్లో
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వస్తారని, ఈ సమావేశం కోసం ఆయన విదేశీ పర్యటన కూడా
వాయిదా వేసుకున్నారని వెల్లడించారు. కేంద్ర కార్యదర్శులతో సమావేశంతో పాటు
ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన అవసరం ఢిల్లీలో ఉందని వివరించారు.
ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటనపై మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని విమర్శించారు.
నిధుల్లేకే ఇటీవల జరగాల్సిన జగనన్న వసతి దీవెన కార్యక్రమం వాయిదా వేశామని
జవహర్‌రెడ్డి వెల్లడించారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం కార్యక్రమాల అమలుకు
నిధులతో ఇబ్బంది లేకుండా చూస్తానని స్పష్టం చేశారు. ఆర్థికశాఖ సూచనల మేరకే
వసతి దీవెనను వాయిదా వేశామని వివరించారు.