ఏలూరు : రాష్ట్రంలోని ప్రతీ పేద గడపకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడమే
లక్ష్యంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర
గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి
సమావేశపు హాలులో మంగళవారం జగనన్న ఇళ్ల ప్రగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో
సమీక్షించిన అనంతరం పాత్రికేయులతో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూరాష్ట్రంలో
జగనన్న ఇళ్ళు జగనన్న ఊళ్లను తలపిస్తున్నాయన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య
భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ చేపట్టని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 17 వేల 5
జగనన్న కాలనీలలో 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలంతోపాటు ఇల్లు నిర్మించే
అతి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తుంటే
ఓర్వలేని ప్రతిపక్షాలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని, ఈ కార్యక్రమంపై బురద
జల్లుతూ ఇళ్ల స్థలాలపై కోర్టులలో కేసులు వేస్తున్నారన్నారు. ఎన్ని ఆటంకాలు
కలిగించిన రాష్ట్రంలో జగనన్న ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి
ఒక యజ్ఞంలా చేపట్టారని, ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో నిర్దేశించిన సమయంలోగా
జగనన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. అంతేకాక జగనన్న కాలనీలలో
ఎక్కడా చిన్నపాటి లోపాలు లేకుండా రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ వంటి
మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించి, జగనన్న ఇళ్ల నిర్మాణ పనులను
పరుగులు పెట్టిస్తున్నారన్నారు. జగనన్న ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి
పెండింగ్లో ఉన్న బిల్లులను ఈ నెలలో చెల్లిస్తామన్నారు. జగనన్న ఇళ్ల పథకంపై
అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమగ్రంగా చర్చించామని, వారు తెలియజేసిన
సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. . జగనన్న ఇళ్ల
స్థలాలకు సంబంధించి కోర్ట్ లో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు
తీసుకుంటామని మంత్రి జోగి రమేష్ చెప్పారు.