అమరావతి : వైసీపీ ముఖ్యనేతలతో సీఎం జగన్ అత్యవసరంగా సమావేశమయ్యారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ భేటీకి టీటీడీ ఛైర్మన్ వైవీ
సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి
భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. సీఎం అనంతపురం పర్యటన, అధికారిక సమీక్షలు రద్దుతో
పాటు మాజీ మంత్రి వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి అరెస్ట్, ఇవాళ మధ్యాహ్నం
3 గంటలకు ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ ముందు హాజరు కానుండటం తదితర పరిణామాల
నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు
అవినాష్ పులివెందుల నుంచి హైదరాబాద్ బయల్దేరినపుడు ఆయనతో పాటు చెవిరెడ్డి
భాస్కర్‌రెడ్డి ఉన్నారు. ఆ సమయంలో ఈ కేసుపై అవినాష్‌తో చర్చించిన అంశాలను సీఎం
జగన్‌కు చెవిరెడ్డి వివరించనున్నట్లు సమాచారం. మరోవైపు అవినాష్ ముందస్తు
బెయిల్ పిటిషన్‌పై మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? ఆ
తర్వాత జరిగే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి? పార్టీ తరఫున ఎలా ముందుకెళ్లాలి?
తదితర అంశాలపై నేతలతో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.