కడప : కడప మాజీ ఎంపీ వివేకానందా రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణలో వేగం
పెంచింది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన
అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసింది. తాజాగా ఈ
కేసులో అవినాష్ రెడ్డి తండ్రిని వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు
చేసింది. ఈ రోజు ఉదయం పులివెందులలోని అవినాష్ రెడ్డి నివాసానికి సీబీఐ
అధికారులు రెండు వాహనాల్లో చేరుకున్నారు. అనంతరం భాస్కర్‌రెడ్డి అరెస్టు
మెమోను కుటుంబసభ్యులకు అందించి అరెస్టు చేశారు.కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి
భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సమయంలో వారి అనుచరులు భారీగా అక్కడికి
చేరుకున్నారు. సీబీఐ అధికారులు అరెస్టు చేసి కడపకు తరలించే సమయంలో భాస్కర్
రెడ్డిని తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారి నుంచి
తప్పించి సీబీఐ అధికారులు ఆయనను కడపకు తరలించారు. వివేకా హత్యకేసులో
భాస్కర్‌రెడ్డి ప్రధాన సూత్రధారి అనే ఆరోపణలున్నాయి.