అపీటా కార్యాలయంలో అట్టహాసంగా ప్రారంభించిన ఎంపీ గురుమూర్తి, సందీప్ మఖ్తల
ప్రారంభం రోజే ఏపీకి 1848 కోట్ల పెట్టుబడుల రాక
తద్వారా 121800 మందికి ఉపాధి
తిరుపతి : ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటీఐటిసి) తెలుగు
రాష్ట్రాల్లో తన కార్య కలాపాలను మరింత విస్తరించడంలో భాగంగా నేడు
తిరుపతిలో కార్యాలయం ప్రారంభించింది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
డబ్ల్యూటీఐటిసి
అధ్యక్షులు సందీప్ కుమార్ మఖ్తల ముఖ్య అతిధులుగా విచ్చేసి తిరుపతి
కార్యాలయం ప్రారంభించారు. డబ్ల్యూటీఐటీసీకి సంభందించిన వివిధ సంస్థలు ఈ
సందర్భంగా పాల్గొని 1848 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం
చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ కంపెనీల మధ్య అనుసంధానత
పెంచడం, పెట్టుబడుల కల్పన, స్టార్టప్‌లకు ప్రోత్సాహం లక్ష్యంగా కృషి
చేస్తున్న డబ్ల్యూఐటీసీ ఈ మేరకు తిరుపతిలో కార్యాలయం ఏర్పాటు చేయగా
ఆదివారం తిరుపతి ఎంపీ గురుమూర్తి, డబ్ల్యూఐటీసీ వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్య
అతిథులుగా విచ్చేసి కార్యాలయం ప్రారంభించారు.
ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి ఆధ్వర్యంలో ఐటీ, నాన్ ఐటీ రంగాలకు
చెందిన 15 కంపెనీల సీఈఓలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా కంపెనీల మధ్య
జరిగిన ఒప్పందాల విలువ రూ. 1848 కోట్లు కాగా దాదాపు 121800 మందికి ఉద్యోగ
అవకాశాలు దక్కుతున్నాయి. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతిలో
డబ్ల్యూఐటీసీ తమ కార్యాలయాన్ని ప్రారంభించడం శుభపరిణామం అని అలాగే
ప్రపంచంలోనే మొట్టమొదటి కార్యాలయ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సందీప్
మఖ్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పట్టణంలో ఐటీ కంపెనీల స్థాపన
కోసం విచ్చేసిన కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో భేటీ అయి పేరు పేరున ధన్యవాదాలు
తెలిపారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరం మాత్రమే కాకుండా వందల ఏళ్లుగా
విద్యాలయాలకు నిలయంగా ఉందన్నారు. తిరుపతిలో ఐటీ కంపెనీల స్థాపించి
పెట్టుబడులు పెట్టడం వల్ల ఇటు సంస్థలకు, అటు స్థానికులకు మేలు
జరుగుతుందన్నారు. ఐటీ కంపెనిలకు అవసరమైన మానవ వనరుల అందుబాటులో ఉండటమే
కాకుండా యువతకు అవకాశాలు దక్కుతాయన్నారు. ప్రభుత్వం తరఫున
భూకేటాయింపుతో పాటుగా ఇతర ఇన్సెంటివ్‌ల విషయాల్లో సంపూర్ణ సహకారం
అందిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా డబ్ల్యూఐటీసీ చైర్మన్ సందీప్ మఖ్తల
మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల ఐటీ సంస్థల ప్రతినిధులు, స్టార్టప్‌లు,
పెట్టుబడిదారుల మధ్య అనుసంధానత కల్పించి అభివృద్ధి చెందించడం తద్వారా
రెండు తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడులు తెచ్చే లక్ష్యంగా డబ్ల్యూటీఐటీసీ కృషి
చేస్తుందన్నారు. తిరుపతిలో ప్రముఖ విధ్యా సంస్థలు ఉన్నాయని తద్వారా నాణ్యమైన
మానవ వనరులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. తిరుపతిలో తమ కార్యాలయ ఏర్పాటుకు
ఉచితంగా స్థలాన్ని కేటాయించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్
రెడ్డికి మరియు అపీటా సంస్థ కిరణ్ సలికిరెడ్డికి, చెవిరెడ్డి హేమచంద్ర
రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యాలయ ప్రారంభం రోజే పెద్ద
ఎత్తున్న పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ఒప్పందాలు కుదుర్చుకున్న
సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సూట్స్ కేర్ ఇండియా ప్రైవేట్
లిమిటెడ్ సీఈఓ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి దేవదేవుని చెంత తమ
కంపెనీ నెలకొల్పే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. రూ.300
కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎంఓయు కుదుర్చుకొన్నామని తద్వారా సుమారుగా 2000
మందికి ఉపాధి దక్కుతుందన్నారు.
ఒప్పందం కుదుర్చుకున్న సైమ్యాక్స్ ఇన్ఫో్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ
ఎం.గౌరీశంకర్ మాట్లాడుతూ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో తన విద్యాబ్యాసం
కొనసాగిందని గుర్తు చేసుకుంటూ వ్యాపార విస్తరణలో భాగంగా తిరుపతి అభివృద్ధిలో
బాగామయ్యే అవకాశం దొరకడం సంతోషకరమన్నారు. సుమారు 100 కోట్ల పెట్టుబడి
పెట్టనున్నామని తద్వారా సుమారు 250 మందికి ఉపాధి అవకాశాలు లభించునున్నాయని
అన్నారు.
ఎస్ఆర్ఆర్ క్లౌడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ కోంబాట్, వేల్ ఐటీ
సొల్యూషన్స్, ఫ్యూజెనిక్ పవర్ సొల్యూషన్, ఐడియావటర్ సొల్యూషన్స్ ప్రై.లి, జెని
5, గోజర్స, తదితర కంపెనీలు ఒప్పందం చేసుకున్న వారిలో ఉన్నారు.