గుంటూరు : ఏదో విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని అప్రతిష్టపాలు
చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం
చేశారు. పేర్ని నాని శనివారం మీడియాతో మాట్లాడుతూ కక్షపూరితంగా సీఎం జగన్ను
అపఖ్యాతిపాలు చేయాలని చూస్తున్నారని, సీఎం జగన్పై దాడి ఘటనలో తప్పుడు
వార్తలు రాస్తున్నారన్నారు. హత్యాయత్నం జరిగిందని ఎన్ఐఏ, పోలీసులు కూడా
ఒప్పుకున్నారు. సీఎం జగన్పై హత్యాయత్నం చేసింది మా పార్టీ వ్యక్తే అని
హడావిడిగా దాడి జరిగిన గంట వ్యవధిలోనే అప్పట్లో డీజీపీ చెప్పేశారు. దాడి
జరిగిన తర్వాత కనీసం పరామర్శించకుండా విమర్శలు చేశారు. దాడి ఘటనపై ఇష్టానుసారం
తప్పుడు వార్తలు రాస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు
మహానేత వైఎస్ఆర్ ఖండించారని, పటిష్ట భద్రత ఉన్న ఎయిర్పోర్టులోపలికి కత్తి
ఎలా వచ్చింది?. హత్యాయత్నం వెనుక ఎవరు ఉన్నారనే దానిపై వెల్లడించాలని అప్పట్లో
వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. ఘటనపై విచారణ జరపాలని కోరడం తప్పా?. విశాఖ
పోలీసులను ఎవరు ప్రభావితం చేశారు?. ఎయిర్పోర్టు అధికారులను ఎవరు ప్రభావితం
చేశారు?. నిందితుడి గురించి విచారించకుండానే స్టేట్మెంట్లు ఇచ్చారని తెలిపారు.