రాష్ట్రానికి ప్రత్యేక హోదా ని సాధించాలి
ఆప్ విజయవాడ పార్లమెంట్ ఇంచార్జి కంభంపాటి కృష్ణ
విజయవాడ : ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో కానీ ప్రభుత్వ వ్యవస్తలైన ఈడీ,
సిబిఐ, సిఐడిని వాడుకోవటం ప్రతిపక్షాల నోరు నొక్కటం తప్ప ప్రజలకు ఏమి
చెయ్యాలో తెలియని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని ఆప్ విజయవాడ పార్లమెంట్
ఇంచార్జి కంభంపాటి కృష్ణ ఆరోపించారు. ఎంత సేపూ పగా, ప్రతీకారం తో మాత్రమే
పాలన చేస్తున్నాయని ధ్వజమెత్తారు. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల
సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ కంభంపాటి కృష్ణ
మాట్లాడుతూ గాంధీ బ్రతికి ఉంటే బీజేపీ వారు అయన మీదకి ఈడీ, సిబిఐని పంపించే
పరిస్థితి నెలకొందని, ప్రస్తుతం దేశంలో, రాష్టంలో అధిక ధరలు, నిరుద్యోగం
చాలా తీవ్రంగా ఉన్న వాటి మీద ద్రుష్టి పెట్టి ఎలా అధిగమించాలన్న ఆలోచన
చేయట్లేదన్నారు. ఈ మధ్య ఆప్జాతీయ పార్టీగా ఆవిర్భవించిందన్న ఏడుపుతో బీజేపీ
మామీద పగతో మా నాయకుడిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారాణి,
ఇవన్నీ మానుకొని బీజేపీ, వైసీపీ వారు పాలన మీద ద్రుష్టి పెట్టాలని హితవు
పలికారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు, ప్రత్యేకహోదా జేఏసీ చైర్మన్ ఫణిరాజ్
మాట్లాడుతూ 10లక్షల 72 వేల కోట్లు తన మిత్రులకు ఎందుకు రుణమాఫీ చేసారని
అడిగినందుకు ఆమ్ ఆద్మీ నాయకులను అక్రమం గా అరెస్టులు చేసారని, మా అధినాయకుడు
అరవింద్ కేజ్రీవాల్ కి సిబిఐ నోటీసులు జారీ చేసిందని, ఎన్నో నెలలనుండి మనీ
లాండరింగ్ కేసుల్లో వున్న కొంతమంది నేరస్థుల చేత తప్పుడు సాక్ష్యాలు సృష్టించి
మా నాయకులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం చేసే
దురాగతాలను దేశ వ్యాప్తంగా ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. దమ్ము ధైర్యం
ఉంటే రాష్ట్రంలో ఉన్న జగన్, పవన్, చంద్రబాబు మోడీ చేసే అక్రమాలకు
వ్యతిరేకంగా పోరాడాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ని సాధించాలని కోరారు.
ఇప్పటికైనా కళ్ళు తెరచి రాష్ట్ర యువత భవిష్యత్ గురించి ఆలోచించాలన్నారు. ఈ
కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కందుల పరమేష్ పాల్గొన్నారు.