ఆంధ్ర ప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
గుంటూరు :టీడీపీ కోటలు బద్దలు అవుతున్నాయని, ఏడు లక్షల మంది సైనికులు
చేస్తున్న సర్వేలో అదే తేలుతోందని ఆంధ్ర ప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు
సురేష్ స్పష్టం చేశారు. కరోనా వలన ఆర్ధిక సమస్యలు వచ్చినా ఏపీ అభివృద్ధిలో
ముందుకు దూసుకుపోతోందని, సీఎం జగన్ సువర్ష పాలనలోనే ఇది సాధ్యం అయిందని
చెప్పారు. శనివారం మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ గణాంకాలతో
ప్రజలకు జరిగిన మేలును వివరిస్తున్నామన్నారు. మాకు ఓటు వేయని వారికి కూడా సాయం
చేశామని, అందరికీ మేలు చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని తెలిపారు