రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు * 276, 277 వార్డు
సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజల్లో నమ్మకం
రెట్టింపు అయ్యిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు పేర్కొన్నారు. శనివారం 63 వ డివిజన్ 276, 277 వార్డు సచివాలయాల
పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్
మోదుగుల తిరుపతమ్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. డాక్టర్స్ కాలనీ, విశాలాంధ్ర
కాలనీలలో విస్తృతంగా పర్యటించి.. 215 గడపలను సందర్శించారు. నాలుగేళ్ల పాలనలో
అందించిన సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. గత పాలకులకు కేవలం
ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తొచ్చే వారని మల్లాది విష్ణు విమర్శించారు. కానీ
ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలతో మమేకమయ్యే బృహత్తర కార్యక్రమానికి సీఎం వైఎస్
జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమం ద్వారా అనేక స్థానిక సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తోందని
చెప్పుకొచ్చారు. అలాగే తెలుగుదేశం అధికారంలో ఉండగా నిర్లక్ష్యం చేసిన పనులను ఈ
ప్రభుత్వం పూర్తి చేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. రోడ్లు, వీధి
దీపాలు, త్రాగునీటి, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను అన్ని వీధులలోనూ
కల్పించినట్లు చెప్పారు. కనుకనే ప్రజల ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి మెండుగా
ఉన్నాయని పేర్కొన్నారు.
శాచ్యురేషన్ పద్ధతిలో సంక్షేమం : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన
తర్వాత శాచ్యురేషన్ పద్ధతిలో పేదలందరికీ సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయని
మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రతీ కుటుంబానికి కనీసం ఒకటి నుంచి 6, 7 వరకు
సంక్షేమ పథకాల ద్వారా మేలు చేకూరడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా
లబ్ధిదారు దేవరకొండ నాగమణి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ప్రభుత్వ సాయం కోసం
ఆత్మాభిమానం చంపుకొని కాళ్లరిగేలా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన
పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో పారదర్శకంగా
పథకాలు అందుతున్నట్లు వెల్లడించారు. తమ కుటుంబానికి వైఎస్సార్ చేయూత, ఆసరా,
జగనన్న చేదోడు, ఇంటి స్థలం మంజూరైనట్లు చెప్పారు. మరో లబ్ధిదారు షేక్
షరీఫున్నీసా మాట్లాడుతూ జగనన్న వసతి దీవెన, అమ్మఒడి, సున్నా వడ్డీ (డ్వాక్రా),
వైఎస్సార్ ఆసరా, విద్యాదీవెన, వైఎస్సార్ వాహనమిత్ర వచ్చినట్లు వివరించారు. ఈ
సందర్భంగా సీఎం జగనన్నకు ఎమ్మెల్యే ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
పేలవంగా చంద్రబాబు టూర్ : ప్రజల నుంచి కనీస స్పందన లేకపోవడంతో చంద్రబాబు
ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటన చప్పగా సాగిందని మల్లాది విష్ణు విమర్శించారు.
అధికారంలో ఉండగా ఏమీ చేయలేకపోయిన ఆయన, ఇప్పుడు అధికారం కట్టబెడితే ఏదో
చేసేస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న గత ఐదేళ్లు
రాష్ట్రానికి, ప్రజలకు బాబు ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. అధికారంలో ఉన్నంత
కాలం జలగల్లా ప్రజలను పీక్కుతున్న చంద్రబాబు, నారా లోకేష్ లను మించిన సైతాన్లు
దేశంలోనే మరొకరు ఉండరని మల్లాది విష్ణు విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న ఈ
నాలుగేళ్లలోనూ ప్రజల కోసం ఏనాడూ చంద్రబాబు మాట్లాడలేదని.. రాష్ట్రం మేలు కోసం
ఒక సలహా కానీ, సూచన కానీ చేయలేదన్నారు. కేవలం పచ్చ మీడియా ఉంది కాబట్టి
రాష్ట్రంలో తండ్రీకొడుకుల ఆటలు, గోబెల్స్ ప్రచారాలు సాగుతున్నాయని
మండిపడ్డారు. సీఎం జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అన్ని
రంగాలలో ముందంజలో ఉందని.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమం, అభివృద్ధి
ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈ(వాటర్
సప్లై) రామకృష్ణ, ఏఈ అరుణ్ కుమార్, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, ఆర్ఐలు ప్రసాద్,
సరత్, నాయకులు మోదుగుల గణేష్, సీహెచ్ రవి, నాగు, టెక్యం కృష్ణ, నాగలక్ష్మి,
అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, గృహసారధులు
పాల్గొన్నారు.