జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్
విజయవాడ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొన్ని వర్గాలకు పరిమితం చేయడం సమంజసం
కాదని, దేశంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు కల్పించిన గొప్ప
వ్యక్తి అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం
వద్ద ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహానికి జనసేన పార్టీ విజయవాడ తరఫున ఘనంగా
నివాళులర్పించిన నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ
నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు సెంట్రల్ నియోజకవర్గ నాయకులు బొలిశెట్టి
వంశీకృష్ణ నగర ఉపాధ్యక్షులు వెన్నా శివశంకర్ కామల్ల సోమనాథం ఈ కార్యక్రమంలో
పాల్గొన్నారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ ఆర్థిక పారిశ్రామిక కార్మిక విద్యా
వైద్య అంశాలపై లోతైన అధ్యయనం చేసి అనేక గ్రంథాలు రచించి ప్రపంచానికే ఒక
ఆదర్శవంతమైన వ్యక్తి అయ్యారని, కానీ ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ పాలనలో
అంబేద్కర్ ని అనేక సందర్భాల్లో అవమానించారని, ఒక జిల్లాకు పేరు పెట్టే విషయంలో
అంబేద్కర్ పేరును వివాదాల్లోకి లాగారన్నారు. అదే విధంగా విదేశీ విద్యా
పథకానికి అంబేద్కర్ పేరు తీసివేశారని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే
నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారని లేని
పక్షంలో జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలకు అందరూ జైల్లో ఊచలు
లెక్కపెట్టేవారని, దళితులకు 27 పథకాలు రద్దు చేసిన సీఎం జగన్ ముమ్మాటికి దళిత
ద్రోహి అన్నారు. రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ అంబేద్కర్
భావజాలాన్ని పవన్ కళ్యాణ్ నిరంతరం అమలు చేస్తున్నారని, వారి అడుగుజాడల్లో
నడుస్తున్నారని అదేవిధంగా జనసేన పార్టీ లీగల్ సెల్ కు అంబేద్కర్ పేరు
పెట్టుకున్నామని, జయంతులకో వర్ధంతులకు అంబేద్కర్ పేరు స్మరిస్తే సరిపోదని,
నిరంతరం వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరంలోని
రాష్ట్ర కమిటీ, నగర కమిటీ , డివిజన్ అధ్యక్షులు, అమ్మవారి ధార్మిక సేవ మండలి ,
కృష్ణ పెన్నా మహిళా కమిటీ, అధికార ప్రతినిధులు, లీగల్ సెల్, ఐటి, జిల్లా
ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.