విజయవాడ : ప్రభుత్వాలు పట్టించుకోకపోతే అంబేద్కర్ స్పూర్తిగా కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలు సమస్యలపై తిరుగుబాటు చేస్తారని ఏపిసిసి అధ్యక్షులు గిడుగు
రుద్రరాజు హెచ్చరించారు. శుక్రవారం ఆంధ్రరత్న భవన్ నందు జరిగిన పత్రికా
సమావేశంలో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు అన్నింటిని
నిర్వీర్యం చేస్తుందని, కక్ష సాధింపులకు దిగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం
చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కక్ష సాధింపు చర్యలకు దిగివుంటే ప్రధాని
నరేంద్ర మోదీ గుజరాత్‌కు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదని, ఇప్పుడు ప్రధాన మంత్రి
కూడా అయ్యేవారు కాదన్నారు. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, రాజధాని అమరావతి,
ఉద్యోగ నియామకాలు, రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మోదీ
కక్ష సాధింపులకు వ్యతిరేకంగా ఈనెల 24వ తేదీ జింఖానా గ్రౌండ్లో రాష్ట్ర
కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఆయన మీడియాకు
తెలిపారు. మార్గదర్శి చిట్ ఫండ్ యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు
చర్యలకు దిగుతుందని, ఇది సరైన పద్దతి కాదని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ
విలేకరుల సమావేశంలో అధ్యక్షులు రుద్రరాజుతో పాటు కార్యనిర్వహక అధ్యక్షులు
సుంకర పద్మశ్రీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లామ్ తాంతియా కుమారి, నగర
కాంగ్రెస్ అధ్యక్షులు, నరహరశెట్టి నరసింహారావు, వి.గురునాధం, పి.వై.కిరణ్,
ధనేకుల మురళీమోహన్, కొలనుకొండ శివాజి, చిలకా విజయ్ కుమార్, పి.నాంచారయ్య,
మీసాల రాజేశ్వరరావు, మేడా సురేష్, బైపూడి నాగేశ్వరరావు, ఎమ్.సునీత,
ఖుర్షీదా, భాగ్యలక్ష్మి, ఇమ్రాన్, జగన్మోహన్ రెడ్డి, గౌస్ తదితరులు
పాల్గొన్నారు. పత్రికా సమావేశం అనంతరం ఈనెల 24వ తేదీన జింఖానా గ్రౌండ్ నందు
జరగబోవు జై భారత్ సత్యాగ్రహ భారీ బహిరంగ సభకు సంబంధించి ఏపిసిసి అధ్యక్షులు
గిడుగు రుద్రరాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కలిసి పోస్టర్ విడుదల చేశారు.