రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్
సిపి జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో పేద
ప్రజల ఇళ్ల కోసం 30.25లక్షల మందికి 71,811.49 ఎకారాల్లో,ఇళ్ల స్థలాల పంపిణి
కోసం రూ.56,102.91 కోట్లు వ్యయం చేసిందన్నారు. కాలనీల్లో మౌలిక సదుపాయల కల్పన
కోసం రూ.36.026 కోట్లు వ్యయం చేయగా,లబ్ధిదారులకు ప్రభుత్వం వాటి కింద
చెల్లింవులు, ఇతర రాయితీల కోసం రూ.13,758 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు.
టిడ్కో పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.21 వేల కోట్ల లబ్ధి : జగన్ మోహన్ రెడ్డి
ప్రభుత్వం టిడ్కో హౌసింగ్ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ. 21000 కోట్ల లబ్ధి
చేకూరుస్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో 300 చ.అ ఇళ్ల లబ్థిదారులు రూ.2.65
లక్షల బ్యాంకు లోన్ చెల్లించాల్సి ఉండేదన్నారు. వడ్డితో కలిపి ఒక్కో
లబ్ధిదారుడు రూ.7.20 లక్షల మేర చెల్లించాల్సి వచ్చేదని, అది ఇప్పుడు పూర్తిగా
ఉచితమని చెప్పారు. ఇళ్ల పథకానికి జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదే
నిదర్శనమని చెప్పారు.
*అంబేద్కర్ ఆశయాల సాధనకు జగన్ ప్రభుత్వం కట్టుబడి వుంది : బాబాసాహెబ్
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఆయన సేవలను
విజయసాయిరెడ్డి కొనియడారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ఈ ప్రభుత్వం కట్టుబడి
వుందన్నారు. విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్
విగ్రహన్ని ప్రభుత్వం నిర్మిస్తోందని చెప్పారు.*
చరిత్ర సృష్టించిన భారత ఇంజనీర్లు : భారతదేశంలో మొదటిసారిగా నీటి అడుగున
రైలును నడిపి కొత్త చరిత్ర సృష్టించిన కోల్‌కతా మెట్రో ఇంజనీర్లు కార్మికులకు
విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు.. కోల్‌కతా, హౌరాల మధ్య హుగ్లీ నది కింద
నిర్మించిన సొరంగంలో వేయబడిన మెట్రో రైలు మార్గం చక్కటి ఇంజనీరింగ్‌కు ఉదాహరణ
అని అన్నారు.