బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ర్యాలీ
విజయవాడ : బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం అంబేద్కర్ జయంతి వేడుకలను
నిర్వహించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అంబేద్కర్ చిత్ర
పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు
మాట్లాడుతూ దేశంలో సమానత్వానికి అంబేద్కర్ పెద్ద పీట వేశారని, అంబేద్కర్
దేశం పరిస్థితులపై అధ్యయనం చేశారన్నారు. ఆర్టికల్ 370ని కూడా అంబేద్కర్
అంగీకరించలేదని, దృడ చిత్తంతో అంబేద్కర్ వ్యవహరించారని, అంబేద్కర్ ఆలోచనను
అమలు చేస్తోంది బిజెపి మాత్రమేనని పేర్కొన్నారు. ఆనాడు చాలా పార్టీ లు ఉన్నా
అంబేద్కర్ ఆలోచన లను అమలు చేయడానికి బిజెపి ఏర్పడిందని చెప్పారు. ఎస్సీ మోర్చా
రాష్ట్ర అధ్యక్షుడు గుడిసే దేవానంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా
శివన్నారాయణ, చంద్రమౌళి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ర్యాలీ : బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి
తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ర్యాలీగా బీజేపీ నేతలు వెళ్లారు. తుమ్మలపల్లి
కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు
సోమువీర్రాజు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం
వద్ద బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియా తో మాట్లాడుతూ భారత
జాతి మార్గదర్శి అంబేద్కర్ అని, భారత జాతి సమగ్రత విషయం లో అంబేద్కర్ ఆలోచన
దేశానికి అవసరం అన్నారు. ప్రభుత్వ ఫలాలు జాతి మొత్తానికి అందాలని అంబేద్కర్
ఆకాంక్షించారని, దేశ సమగ్రత విషయం లో 370 ఆర్టికల్ విషయం లో కూడా అంబేద్కర్
స్పష్టమైన అభిప్రాయం వెల్లడించారని, అంబేద్కర్ ఆలోచన లకు బిజెపి రుణపడి
ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసే
దేవానంద్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రశివన్నారాయణ, రాష్ట్ర
ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, రాష్ట్ర
కార్యవర్గ సభ్యులు దాసం ఉమామహేశ్వర రాజు,అడ్డూరి శ్రీ రాం బిజెపి జిల్లా
అధ్యక్షుడు బబ్బూరి శ్రీ రాం, బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్రారెడ్డి
తదితరులు పాల్గొన్నారు.