మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం : ఆధునిక భారతదేశానికి మార్గదర్శిగా నిలచిన డాక్టర్ బి ఆర్
అంబేడ్కర్ అందరికీ స్ఫూర్తి ప్రదాత అని మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ జిల్లా
అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ఉదయం అంబేడ్కర్ 132వ
జయంతి సందర్భంగా పలు చోట్ల నిర్వహించిన కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా
హాజరయ్యారు. పోలాకి మండలం పోలాకిలో, నరసన్నపేట మండలం తామరాపల్లిలో అంబేడ్కర్
జయంతి సందర్భంగా అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నరసన్నపేట టౌన్ లో
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నరసన్నపేట టౌన్
అంబేద్కర్ జంక్షన్ లో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఉర్లాం లో అంబేడ్కర్
జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీకాకుళంలో పార్టీ
కార్యాలయంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు పొన్నాడ ఋషి నిర్వహించిన కార్యక్రమంలో
పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ ఆధునిక ప్రయాణంలో ఓనమాల
దగ్గరే ఉన్న ఒక దేశానికి ఆయన ఉన్నతమైన రాజ్యాంగాన్ని ఇచ్చారన్నారు.
స్వేచ్ఛలను, పరస్పర బాధ్యతలను ఎప్పటికప్పుడు పునర్ నిర్వచించుకుంటూ, విశాలం
చేసుకుంటూ, మరింత మానవీయంగా మార్చుకుంటూ ప్రయాణించడానికి కావలసిన
ప్రాతిపదికలన్నీ భారత రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. అంబేడ్కర్ అంటే ఆయన
జ్ఞానం, ఆయన పంచిన చైతన్యం, ఆయన విశ్వసించిన విలువలు, ఆయన అందించిన రాజ్యాంగ
స్ఫూర్తి నిరంతరం మనకు మార్గదర్శకమన్నారు. అంబేడ్కర్ పేరు జపించే వ్యక్తులు,
శక్తులు ఎంతవరకు ఆయన సిద్ధాంతాలను అర్థం చేసుకున్నారో, ఆచరిస్తున్నారో బేరీజు
వేసుకోవాలనీ, ఆయన కుడిచేతి చూపుడు వేలు దృక్పథం అయితే, ఎడమచేతితో పట్టుకున్న
భారత రాజ్యాంగం ప్రజలకు అందిస్తున్న ఆయుధమని చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధన
కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలుపెరగని కృషి చేస్తున్నారన్నారనీ
చెప్పారు.