విజయవాడ : సెల్ఫీ ఛాలెంజ్ అంటే సోషల్ మీడియాలో నాలుగు ఫేక్ ఫోటోలు పెట్టి
అబద్ధాలు ప్రచారం చేయడం కాదని, ప్రతి పేదవాని ఇంటి ముందు నిలబడి మా ప్రభుత్వ
హయాంలో ఈ ఇంటికి ఇంత మేలు చేశాము అని ధైర్యంగా చెప్పగలిగితే అది మంచి సెల్ఫీ
అవుతుందని అదే అసలైన సెల్ఫీ ఛాలెంజ్ అని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా
గురువారం పలు అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు.
ప్రతి ఇంటిలో వెలుగులు నింపాలని తపిస్తున్న సీఎం జగన్
ప్రతి ఇంటిలో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం
పరితపిస్తుంటారని అందుకే మేనిఫెస్టోలో లేకపోయినా ఓసీ వర్గాల్లోని
అక్కచెల్లెమ్మలకు కూడా ఆర్థిక తోడ్పాటు అందించాలని ఈబీసీ నేస్తం లాంటి పథకాలు
అమలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. ఇంటింటి దీపాలు బాగుంటేనే
కుటుంబాలు బాగుంటాయని సీఎం జగన్ ఉద్దేశమని అన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, మహిళలు ఆర్థికంగా
నిలదొక్కుకునేలా అన్ని విధాలా సహకారం అందిస్తుందని అన్నారు.
కేంద్రం స్పేస్ సైన్స్ లో రీసెర్చి ప్రోత్సహించాలి
స్పేస్ రంగంలో డిఫెన్సివ్, అఫెన్సివ్ సామర్ధ్యాలను మెరుగుపరచాల్సిన ఆవశ్యకత
ఉందని డిఫెన్స్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అభిప్రాయపడ్దారని విజయ సాయి రెడ్డి
అన్నారు. స్పేస్ లో యుద్ధం వచ్చే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర
ప్రభుత్వం స్పేస్ సైన్స్ లో రీసెర్చ్ ను ప్రోత్సహిస్తుందని, అత్యాధునిక
సాంకేతిక పరిజ్జానంతో ఇండియన్ ఆర్మీని సంసిద్ధం చేస్తారని గట్టిగా
నమ్ముతున్నానని ఆయన అన్నారు.
రెట్టింపైన భారత మొబైల్ ఫోన్ ఎగుమతులు
గత సంవత్సరంలో పోల్చిచూస్తే భారతదేశం నుండి మొబైల్ ఫోన్ ఎగుమతులు రెట్టింపు
అయ్యాయని, 2021-22 లో 45000 కోట్లుగా ఉన్న మొబైల్ ఫోన్ ఎగుమతులు, 2022-23
నాటికి 91000 కోట్లకు చేరిందని విజయసాయి రెడ్డి తెలిపారు. మేక్ ఇన్ ఇండియా
విధానాలు మంచి ఫలితాలనిస్తున్న నేపద్యంలో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో
సెమీకండక్టర్ల తయారీపై దేశం దృష్టిసారించాలని అన్నారు.