జాతీయ బిసి దళ్ అధ్యక్షడు దుండ్ర కుమారస్వామి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల కులగణనకు ముందుకు రావడం నిజంగా
అభినందనీయమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. ఏపీ
ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని
స్వాగతిస్తున్నట్లు దుండ్ర కుమారస్వామి తెలిపారు. వెనుకబడిన తరగతుల (బీసీల)
కుల గణనకు సంబంధించిన మార్గదర్శకాల కోసం త్వరలోనే ఓ కమిటీని ఏర్పాటు చేయాలని
ఏపీ ప్రభుత్వం భావిస్తుండడం అభినందనీయ విషయమని దుండ్ర కుమారస్వామి అన్నారు.
వెనుకబడిన తరగతుల కుల గణనను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ఇతర రాష్ట్రాలు
అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని
సీఎం జగన్ ఆదేశించారని దుండ్ర కుమారస్వామి అన్నారు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని ఎంతో మంది బీసీలకు మంచి జరుగుతుందని కుమారస్వామి ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ కేటగిరీలోని 139 కులాలకు సంక్షేమ ఫలాలు
అందాలని కోరుకుంటున్నట్లు దుండ్ర కుమారస్వామి తెలిపారు.
ఇప్పటికే పలు రాష్ట్రాలలో బీసీ కులగణన చేపట్టారు. ఆయా రాష్ట్రాల తరహాలోనే ఏపీ
కూడా కులగణన చేపట్టనుంది. బీసీ కుల గణనకు ముందుకొచ్చిన బిహార్, ఒడిశా, పంజాబ్
రాష్ట్రాల్లో అధ్యయనం చేయనుంది. ఈ కమిటీ సమర్పించిన నివేదిక అనంతరం
రాష్ట్రంలో బీసీ కుల గణనకు సంబంధించిన మార్గదర్శకాలను వైసీపీ ప్రభుత్వం సిద్దం
చేయనుంది.