కొవ్వూరు : కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమం అందిస్తూ
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్వమతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని
రాష్ట్ర హోంమంత్రి, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డా. తానేటి వనిత
తెలిపారు. కొవ్వూరు మండలంలోని ఐ.పంగిడిలో క్రిస్టియన్స్ ఆర్గనైజేషన్స్ నెట్
వర్క్ లీడర్ షిప్ కాన్ఫరెన్స్ లో హోంమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముఖ్య
ప్రసంగీకులు బ్రదర్ అనిల్ కుమార్ సభలో ప్రార్థనలు చేసి హోంమంత్రికి ఆశీర్వాదం
అందించారు. అనంతరం కుల, మతాలకు అతీతంగా తమపై ప్రేమ, అనురాగాలు ఇలానే
కొనసాగాలని మంత్రి కోరారు. భవిష్యత్ లో కూడా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్
రెడ్డి ఉండాలని అందరూ ఆశీర్వాదించాలని కోరారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ
ఏసుక్రీస్తు కేవలం క్రైస్తవులకు మాత్రమే చెందినవారు కాదని, అన్ని కుల, మతాల్లో
శాంతి స్థాపన కోసం పుట్టిన మహనీయుడని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి కోసం పుట్టిన
మహనీయుడు చూపిన మార్గంలో అందరూ పయనించాలని, శత్రువులను మిత్రులుగా మార్చి వారు
శాంతి మార్గంలో పయనించేలా ప్రేమను చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు
ఫాస్టర్లు, క్రిస్టియన్ సోదరులు పాల్గొన్నారు.