276 వ వార్డు సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నవరత్నాల
పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉద్యమ స్ఫూర్తితో సాగుతున్నాయని ప్లానింగ్
బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు.
బుధవారం 63 వ డివిజన్ 276 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు
శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి గడప గడపకు
మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. రాధానగర్, డాక్టర్స్ కాలనీలో
విస్తృతంగా పర్యటించి 210 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి
వెళ్లి ఆయా కుటుంబాలకు మూడున్నరేళ్లలో జరిగిన మేలును బుక్ లెట్ల ద్వారా
తెలియజేశారు. ప్రజల ఇంటి ముంగిటకే సంక్షేమ ఫలాలు అందిస్తుండడంతో ‘గడప గడపకు మన
ప్రభుత్వం’తో పాటు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం
పడుతున్నారని మల్లాది విష్ణు తెలిపారు. 46 నెలలుగా ప్రభుత్వం అందిస్తున్న
పథకాలతో తమ జీవితాల్లో వెలుగులు నిండాయని ప్రజలు సంతోషంగా చెబుతున్నారన్నారు.
సచివాలయం సందర్శన
పర్యటనలో భాగంగా 276వ వార్డు సచివాలయాన్ని మల్లాది విష్ణు సందర్శించారు.
ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజల నుంచి గ్రీవెన్స్
స్వీకరరిస్తున్నదీ..? లేనిదీ..? ఆరా తీశారు. అర్జీలను తప్పనిసరిగా రికార్డులలో
పొందుపర్చాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు.
సంక్షేమ క్యాలెండర్ పై లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వారిని
చైతన్యపరచాలని సూచించారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు శాచ్యురేషన్
పద్ధతిలో జరగాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ యాప్ డౌన్ లోడ్
చేసుకునేలా హెల్త్ సెక్రటరీ చొరవ చూపాలన్నారు. అలాగే అభివృద్ధి పనులు వేగవంతం
చేసి వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి పూర్తి చేయాలని ఎమినిటీస్ సెక్రటరీకి
సూచనలు చేశారు. రేషన్ వాహనం కచ్చితంగా సమయపాలన పాటించాలని, వాహనం వచ్చే
సమయాన్ని వాలంటీర్లు ముందుగా కార్డుదారులకు తెలియజేయాలన్నారు.
ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తారు..?
చంద్రబాబు గత పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు
పడలేదని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విమర్శించారు. జిల్లాలో
పర్యటించే ముందు తమ హయాంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే
ప్రజల ముందుకు వచ్చి చంద్రబాబు వివరించాలని డిమాండ్ చేశారు. దివంగత మహానేత
వైఎస్సార్ హయాంలో కృష్ణా డెల్టా ఆధునికీకరణ, పేదలకు ఇళ్లు, నూజివీడులో
ట్రిపుల్ ఐటీ నిర్మాణం, బందర్ పోర్టు శంకుస్థాపన, ఇన్నర్ రింగ్ రోడ్డు
నిర్మాణం, ఇలా ఆరేళ్ల పాలనలో ఆయన 60 ఏళ్ళ ప్రగతిని చూపారన్నారు. కానీ తన
హయాంలో చేసిన అభివృద్ధి ఏమీ లేక కాపీ కొట్టడాన్ని చంద్రబాబు అలవాటు
చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తొలి
ఐదు సంతకాలను కాపీ కొట్టిన ఆయన మరలా ఇప్పుడు సీఎం జగన్ మేనిఫెస్టోను, సంక్షేమ
కార్యక్రమాలను కాపీ కొడుతున్నారన్నారు. ఇకనైనా కాపీ విధానాలను మానుకోవాలని
హితవు పలికారు. మరోవైపు టీడీపీ హయాంలో మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన
చంద్రబాబు సంక్షోభంలో ఉన్న విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఒక్క సారి
అందులోనూ స్వల్పంగా పెంచితే గగ్గోలు పెడుతున్నారని మల్లాది విష్ణు
మండిపడ్డారు. చివరకు మురుగుపై కూడా పన్ను వేసిన చంద్రబాబు సీఎం జగన్మోహన్
రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. దేశంలో 100 యూనిట్లు లోపు
విద్యుత్ వినియోగదారులకు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అతి తక్కువ టారీఫ్ ఉన్నట్లు
వెల్లడించారు. కనుకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి తమ ముఖ్యమంత్రి
కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. కార్యక్రమంలో
ఏఎంఓహెచ్ రామ కోటేశ్వరరావు, ఏఈ అరుణ్ కుమార్, సీడీఓ జగదీశ్వరి, డివిజన్
కోఆర్డినేటర్ పసుపులేటి యేసు, నాయకులు మోదుగుల గణేష్, సీహెచ్ రవి, నాగు,
ఉద్ధంటి శ్రీను, సామ్రాజ్యం, వీర్ల శ్రీను, నాగలక్ష్మి, కె.రవి, అన్ని శాఖల
అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.