ట్రెజరీ వ్యవస్థను బలోపేతం చేయాలి
ఉద్యోగులకు సియఫ్ యంయస్ పై నమ్మకం లేదు
ఏపిజెఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
విజయవాడ : ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపిజెఏసి అమరావతి
చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అనకాపల్లి, విజయనగరం జిల్లాలలో బుధవారం
ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపిజెఏసి అమరావతి చైర్మన్
బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులంతా
ప్రభుత్వంలో భాగస్వామ్యం అంటున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన
బకాయిలపై లెక్కలు చెప్పాల్సిన బాద్యత ఉన్నప్పటికీ ఎందుకు బకాయిలపై లెక్కలు
చెప్పడంలేదో, ఇందులో ఏమీ రహస్యలు దాగి ఉన్నాయో ఉద్యోగులకు అర్దం కావడం లేదని,
ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఉద్యోగులకు సంబందించిన డబ్బులు
ఎంతవాడుకున్నారు, ఇంతవరకు ఎంత చెల్లించారో చెప్పాలన్నారు. అలాగే ఉద్యోగులకు
చెల్లించాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయో కూడా ప్రభుత్వం లెక్కలు చెప్పాలని
ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేసారు.
అలాగే ఉద్యోగులకు సీ ఎఫ్ ఎం ఎస్ వ్యవస్థ వల్లనే ఈ దుస్థితి వస్తుందని, కావున
గతంలో మాదిరిగా ట్రజరీల వ్యవస్ధను బలోపేతం చేయాలని బొప్పరాజు డిమాండ్ చేసారు.