కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్
తెలంగాణ అభివృద్దిని చూసి ఓర్చుకోలేకనే ప్రతిపక్షాల కుట్రలు
మోటార్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది
తెలంగాణకు నయాపైసా ఇవ్వని బీజేపోళ్లు కూడా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు
మాయమాటల బీజేపీ, కాంగ్రెస్ ను ప్రజలు తరిమికొట్టాలె
ప్రజల మనిషి సీఎం కేసీఆర్ ను కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉంది
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్ నగర్, మైలారమ్ గ్రామాల ఆత్మీయ
సమ్మేళనాలలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
మహబూబ్ నగర్ : దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పథకాలను గడప గడపకు
తీసుకెళ్లే బాధ్యత బీఆరెస్ పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు పంచాయతీ రాజ్ శాఖ
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బి అర్ ఎస్ పార్టీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా
పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం రాయపర్తి, జేతురాం తండా లకు కలిపి
రాయపర్తి శివారు తోటలో, రాయపర్తి మండలం మైలార0, కిస్త పురం, అర్ అండ్ అర్
కాలనీ, మోరిపి రాల, పన్యా నాయక్ తండా, పోతి రెడ్డి పల్లె, వాంకుడోత్ తండా
గ్రామాలకు కలిపి మొరిపిరాల క్రాస్ రోడ్డు లోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన
ఆత్మీయ సమ్మేళనాలలో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీఆర్ఎస్
పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పాల్గొన్నారు. కార్యకర్తలతో మాట్లాడి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.
మంత్రి దయన్న మీద ప్రేమతో ఓ గౌడన్న తీసుకొచ్చిన కల్లు రుచి చూశారు. ఈ
సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ పాత కొత్త అనే తేడా
లేకుండా కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం
కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, సమైక్య పాలనలో నిరాదరణకు
గురైన పల్లెలు నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. కాళేశ్వరం
ప్రాజెక్టు, 24 గంటల కరెంటు, రైతు బంధు, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి పథకాలు
దేశానికే దిక్సూచీలుగా మారాయని తెలిపారు. అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే
తెలంగాణ నెం 1 గా నిలిచిందని ప్రశంసించారు. మరోవైపు నియోజకవర్గం లో చేసిన
అభివృద్ధి ని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. దేవాలయాల, చారిత్రక ప్రదేశాల,
గ్రామాల అభివృద్ధి కి సంబందించిన వివరాలను మంత్రి తెలిపారు. పాలకుర్తి
నియోజకవర్గం లో చెరువుల బాగు, మిషన్ భగీరథ మంచి నీరు, రిజర్వాయర్లు, చెరువులను
నింపడం, ధాన్యం కొనుగోలు, ఉపాధి హామీ వంటి పలు పథకాలు, రోడ్లు, మండల కేంద్రాల
అభివృద్ధి, వివిధ సంక్షేమ పథకాలను మంత్రి సోదాహరణంగా వివరించారు.
తెలంగాణ అభివృద్దిని చూసి ఓర్చుకోలేకనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని
ఆరోపించారు. తెలంగాణకు నయాపైసా ఇవ్వని బీజేపోళ్లు కూడా తెలంగాణ గురించి
మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ
చేస్తున్న ప్రయత్నాలను సీఎం కేసీఆర్ తిప్పికొట్టారన్నారు. మాయ మాటలతో
తెలంగాణను ఆగం పట్టియ్యాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ను ప్రజలు
తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న
సీఎం కేసీఆర్ ను కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఎర్రబెల్లి
ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు మాట్లాడుతూ దయాకర్ రావు నిరంతరం
నియోకవర్గ అభివృద్ధి గురించి, ప్రజల గురించే ఆలోచిస్తారు. వారి
అభివృద్ధికి పాటుపడతారు. ఇలాంటి నాయకుడు మీకు ఎమ్మెల్యేగా ఉండటం అదృష్టం.
బిఆర్ ఎస్ పార్టీని, సిఎం కెసిఆర్ ని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని
కడుపులో పెట్టుకుని దీవించాలి. అండగా ఉండాలి. ఆదరించాలని చెప్పారు.
మహిళలతో కలిసి ఆత్మీయ భోజనాలు
బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో బాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్
రావు, ఆయన సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా
దయాకర్ రావులు మహిళలతో కలిసి భోజనాలు చేశారు. మహిళలతో కలిసి
ముచ్చటిస్తూ, సరదాగా గడిపారు. అంతకుముందు ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్
ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయ అతిథిగా పాల్గొని,
సిఎం సందేశం చదివి వినిపించారు. ప్రజలు తెలంగాణ ప్రభుత్వాన్ని, కెసిఆర్ ను,
మంత్రి ఎర్రబెల్లి ని కాపాడుకోవాలని హితవు పలికారు. ఫణికర మల్లయ్య ను
సత్కరించారు. బలగం సినిమా నటుడు బాబు ని వేదిక మీదకు ఆహ్వానించారు. ఈ
సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామాల వారీగా పార్టీ ముఖ్యులు,
నాయకులు, కార్యకర్తల పేర్లు చదువుతూ వాళ్ళందరికీ ఆత్మీయ అభినందనలు!,
శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి ఫోటోలు దిగుతూ, వారితో తమ ఆత్మీయతను
చాటుకున్నారు. అనంతరం ప్రభుత్వం, పార్టీ పరంగా జరుగుతున్న అభివృద్ధికి
సంబంధించిన వివరాలు ముఖ్య నాయకులు కార్యకర్తలు ద్వారా మాట్లాడించారు.
ఆయా గ్రామాల వారీగా ఇంకా మిగిలి ఉన్న సమస్యలు, చేయాల్సిన పనులు, జరగాల్సిన
అభివృద్ధిపై కార్యకర్తలతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయా గ్రామాల ప్రజలు
కార్యకర్తలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను అక్కడికక్కడే మంత్రి పరిష్కరించారు.
ఇండ్లు, పెన్షన్లు, దళిత బంధు, కమ్యూనిటీ హాళ్లు వంటివి చర్చించారు. కొన్ని
సామాజిక కులాలకు కమిటీ హాళ్లు, గుడులను అక్కడికక్కడే మంత్రి మంజూరు చేశారు.
అంతకుముందు మంత్రికి ఆయా గ్రామాల ప్రజలు గ్రామ పొలిమేరలోనే ఘనంగా స్వాగతం
పలికారు. దారి పొడవునా పూలు చల్లుతూ, కోలాటాలు, డప్పు చప్పుళ్ళు, నృత్యాలు
చేస్తూ, ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, ముఖ్యులు, కార్యకర్తలు యువత
విభాగం రైతుబంధు సమితి బాధ్యులు, బి అర్ ఎస్ పార్టీ వివిధ విభాగాల బాధ్యులు,
ఆయా గ్రామాల పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.