ఉందా
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి
మార్కాపురం : ‘సామాజిక న్యాయం అంటే అన్ని కులాలకు మంచి చేయడమా, బాబు బృందం
భోజనం చేయడమా అని చంద్రబాబును ప్రజలు నిలదీయాలని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి
పిలుపునిచ్చారు. దేవుడి మీద భక్తి అంటే 45గుళ్లను కూల్చడం, మైనార్టీల మీద
దేశద్రోహం కేసులు పెట్టడమా అని నిలదీయాలన్నారు. జన్మభూమి కమిటీలు మంచివో,
వాలంటీర్ల వ్యవస్థ మంచిదో జనం నిలదీయాలన్నారు. చంద్రబాబుకు సిఎం పదవి అంటే
అరడజను దొంగలు దోచుకోవడం మాత్రమేనన్నారు. ఇంటింటి అభివృద్ధి అనేది తమ నినాదమని
జగన్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు గతాన్ని గుర్తు చేసుకోవాలని
జగన్ విజ్ఞప్తి చేశారు. గతంలో 600 పేజీలతో మ్యానిఫెస్టో తీసుకొచ్చి చంద్రబాబు
ఎన్నికల తర్వాత దానిని చెత్తబుట్టలో వేశాడన్నారు. హామీలన్ని గాలికి
ఎగిరిపోయాయని, చివరకు వెబ్సైట్ నుంచి దానిని మాయం చేశారన్నారు. తమకు
మ్యానిఫెస్టో అంటే బైబిల్, భగవద్గీత, ఖురాన్‌గా భావించి పనిచేస్తున్నామని
చెప్పారు. రాబోయే రోజులు చాలా డ్రామాలు చూడాల్సి ఉంటుందని చెప్పారు.
ఏపీలో కోటిన్నర కుటుంబాలు నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు
లేకుండా, వివక్ష లేకుండా, డిబిటి ద్వారా నేరుగా మహిళల ఖాతాల్లోకి సంక్షేమం
అందుతోందని, దానిని గుర్తు చేసుకోవాలని చెప్పారు. 46నెలల వ్యవధిలో 2.07లక్షల
కోట్ల రుపాయలు నేరుగా బదిలీ చేశామని, దీనిపై ప్రజలు ఆలోచించాలన్నారు.
అప్పట్లో ఓ ముసలాయన
2014-19మధ్య ఏపీలో ఓ ముఖ్యమంత్రి ఉండేవాడని, ముసలాయన ముఖ్యమంత్రిగా ఉండేవాడని
ఇప్పటి మాదరి అప్పట్లో ఈ పథకాలు ఉండేవా, డిబిటి పద్ధతి ఉందా అని జగన్
ప్రశ్నించారు. అప్పట్లో దోచుకో, పంచుకో, తినుకో మాత్రమే ఉందని, డిబిటి
లేదన్నారు. దీనిపై అందరు ఆలోచించాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న
సమయంలో ఎందరికి బ్యాంకు అకౌంట్లు ఉంటే, డిబిటి ద్వారా ఎంత డబ్బు ఖాతాల్లోకి
వేశాడో ఆలోచించుకోవాలన్నారు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, వసతి దీవెన, ఈబీసీ నేస్త,
మత్స్యకార నేస్తం, కాపునేస్తం నేతన్న నేస్తం, విద్యా దీవెన, వసతి దీవెన
పథకాలతో ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా అందుతున్నాయో లేదో గుర్తించాలన్నారు.
ముసలాయన హయంలో ఒక్క రుపాయైనా ఖాతాల్లో వేశాడా అని జగన్ ప్రశ్నించారు. జగన్ ఈ
పథకాలు ఎలా ఇవ్వగలుగుతున్నాడో ఆలోచించాలని, బాబు పాలనలో ఎందుకు లేవన్నారు.
అప్పట్లో డబ్బులు తమ ఖాతాల్లోకి ఎందుకు రాలేదో ఆలోచించాలన్నారు. జనాలకు
అందాల్సిన డబ్బంతా ఏమైపోయిందన్నారు. గత ప్రభుత్వంలో ఈ డబ్బంతా ఎవరు
దోచుకున్నారు, ఎవరు పంచుకున్నారు, ఎవరు తిన్నారో ప్రజలు ఆలోచించాలన్నారు.
సెల్ఫీ దిగాల్సింది ప్రజలతో
చంద్రబాబు పథకాల గురించి మాట్లాడడని, ఫేక్ ఫోటోలు దిగుతాడని, సెల్ఫీ అంటూ
నాలుగు ఫేక్ ఫోటోలు దిగి, సెల్ఫీ ఛాలెంట్ అంటున్నాడని, ఛాలెంజ్ అంటే నాలుగు
ఫేక్ ఫోటోలు కాదని, రాష్ట్రంలో ప్రతి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, ప్రతి పేద
ఇంటి ముందు నిలబడి ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇది అని చెప్పగలిగితే, దానిని
లబ్దిదారులు ఆహ్వానించగలిగితే దానిని సెల్ఫీ అంటారని సిఎం చెప్పారు. ప్రతి
పేద కుటుంబం బాగా పనిచేసినట్లు చెబితే దానిని సెల్ఫీ అంటారన్నారు. 2019-23
మధ్య ఇంటింటికి జరిగిన మంచి ఎంత అనేది బేరీజు వేసే సత్తా చంద్రబాబుకు ఉందా అని
జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. నిజాలు ప్రజలకు, ఇంటింటికి తెలుసని, ప్రతి
మనిషికి తెలుసని, నిందలు, అబద్దాలతో ప్రచారాలు చేస్తున్నారని , అబద్దాన్ని
పదేపదే చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని, అబద్దాల బ్యాచ్‌ను
నమ్మొద్దన్నారు. అబద్దాలు చెప్పేవారిని ఐదేళ్లలో ఒక్క ఇంటి స్థలం కూడా ఎందుకు
ఇవ్వలేకపోయారో నిలదీయాలన్నారు.
స్టిక్కర్ అంటించే అర్హత ఉందా
ఇళ్లకు స్టిక్కర్ అంటించే అర్హత చంద్రబాబుకు ఎక్కడిదని సిఎం జగన్
ప్రశ్నించారు. తమకు ఏ మంచి చేశారని ఇంటి మీద స్టిక్కర్ అంటిస్తున్నారో
ప్రశ్నించాలన్నారు. తమ ఇంటి ముందు సెల్ఫీ దిగే నైతికత ఉందా అని ప్రజలు
చంద్రబాబును ప్రశ్నించాలన్నారు. రైతు భరోసా ద్వారా 53లక్షల మందికి ఏటా
రూ.13,500 అందించామని, చంద్రబాబు రుణమాఫీ ఎందుకు చేయలేదో చంద్రబాబును
ప్రశ్నించాలన్నారు. సున్నా వడ్డీలని మోసం చేసిన బాబుకు స్టిక్కర్ అంటించే
నైతికత ఏముందో నిలదీయాలన్నారు. మోసం చేసిన చంద్రబాబుకు ప్రజల ముందుకు
వచ్చేందుకు ఏ నైతికత ఉందని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
మార్కాపురంకు సిఎం వరాలు
మార్కాపురంకు అత్యంత ముఖ్యమైన వెలిగొండ ప్రాజెక్టులో మొదటి టన్నెల్
పూర్తైందని, రెండో టన్నెల్ సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి అక్టోబర్‌లో
వెలిగొండ ప్రారంభిస్తామన్నారు. వెలిగొండలో 1.8కిలోమీటర్ల పని ఐదారు నెలల్లో
పూర్తి చేస్తామన్నారు. 36కిలోమీటర్ల సొరంగాల్లో 20కిలోమీటర్లు వైఎస్సార్ హయంలో
పూర్తైతే తర్వాత చంద్రబాబు 5కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేదని,
యుద్ధప్రాతిపదికన 11కిలోమీటర్లు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం
చేస్తున్నట్లు చెప్పారు. ఎన్ఎస్పీ నుంచి పొదిలి వరకు 50కిలోమీటర్ల పొడవున
పైప్‌లైన్ నిర్మాణం, మార్కాపురంలో డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ పూర్తి
చేస్తున్నట్లు చెప్పారు. 500కోట్లతో మెడికల్ కాలేజీ పనులు జరుగుతున్నాయని,
మెడికల్ కాలేజీకి భూములిచ్చిన రైతులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.