శ్రీకాకుళం : ప్రభుత్వం అదానీ కోసం ఉందా మత్స్యకారుల కోసం ఉందో, మత్స్య
శాఖామంత్రి సీదిరి అప్పలరాజు చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ
సభ్యులు బి.తులసీదాస్ నిలదీసారు. మంగళవారం నగరంలోని ఇందిరానగర్ కాలనీలో
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భావనపాడు పోర్టు పేరుతో
6వేల ఎకరాలను అదానీకి అప్పగించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. దేశ
సంపదను అదానీకి కట్టబెట్టడంలో మోదీతో జగన్ పోటీ పడుతున్నారన్నారు. రాష్ట్రంలో
ఇప్పటికే కృష్ణపట్నం, గంగవరం పోర్టులతో పాటు హైడ్రో పవర్ ప్రాజెక్టులను
అదానికి ఇచ్చేశారన్నారు. భావనపాడుకు భూముల సేకరణ విషయంలో ప్రభుత్వం ఒకటి
చేస్తూ, ప్రజలకు మరోకటి చెప్తోందనీ, వాస్తవాలు మరోలా ఉన్నాయన్నారు. పోర్టుకు
550 ఎకరాలు మాత్రమే సేకరిస్తామని ప్రజలకు చెప్పిన ప్రభుత్వం, అసెంబ్లీలో
ప్రవేశపెట్టిన సోషియో ఎకానమీ సర్వే పత్రాల్లో 1010 ఎకరాలు సేకరిస్తున్నట్లు
పేర్కొందన్నారు. అధికారులతో ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందన్నారు.
వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ సాల్ట్ భూములు 2200 ఎకరాలు, సీఆర్‌జెడ్
భూములు 750 ఎకరాలు, తంపర భూములు 750 ఎకరాలు, మొత్తం కలిపి 6 వేల ఎకరాలకుపైగా
కట్టబెట్టెందుకు సిద్దమవుతోందన్నారు. రు.రూ.4 వేల కోట్లు ఖర్చు అయ్యే పోర్ట్
నిర్మాణానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, కేవలం రూ.400 కోట్లతో నిర్మాణమయ్యే
బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు పోర్టు
నిర్మాణంతో ఆరు మండలాల్లోని వేలాది ఎకరాలు ముంపునకు గురవుతాయి ఆందోళన వ్యక్తం
చేశారు. పర్యావరణానికి, రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుంటే టీడీపీ వైఖరేమిటో
మాజీ మంత్రి అచ్చెంనాయుడు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భావనపాడు ఫిషింగ్
హార్బర్ నిర్మించాలని బుడగట్లపాలెంలో వెంటనే ఫిట్టింగ్ హార్బర్‌ను
ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి
గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణమూర్తి పాల్గొన్నారు.