అమరావతి : ఏపీలో రెంటచింతలలో అత్యధికంగా 42 .6 డిగ్రీలు, నెల్లిమర్ల లో 41 .9
డిగ్రీలు, రాజాంలో 41 .8 డిగ్రీలు, కర్నూల్ 41 .5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు
అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోర్ భానుడి భగభగలు మొదలయ్యాయి. ఏప్రిల్ నెలలో
సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో వేడికి జనం అల్లాడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎండలు మరింత మండిపోతున్నాయి. అయితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత
పెరగనున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. సంవత్సరం ఎండలు అధికంగా
ఉంటాయని ఎండలు చూస్తేనే తెలుస్తుంది. సూర్యుని నుండి వెలువడే వేడిమిని
తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంకా తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఎండలు
రికార్డ్ సంఖ్యలో నమోదు అవుతున్నాయి.
సాధారణంగా ఎప్పుడూ ఉష్ణోగ్రతల కన్నా ప్రస్తుతం మరీ ఎక్కువగా ఎండలు ఉండడం
బాధాకరం. రోజులో సాధారణ డిగ్రీల కన్నా కూడా రెండు డిగ్రీలు ఎక్కువగానే నమోదు
అవుతున్నట్లు ఐ ఎం డి పేర్కొంది. ఏపీలోని నిన్న రెంటచింతలలో అత్యధికంగా 42 .6
డిగ్రీలు, నెల్లిమర్ల లో 41 .9 డిగ్రీలు, రాజాంలో 41 .8 డిగ్రీలు, కర్నూల్ 41
.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ రోజు అడ్డతీగల , నెల్లిపాక ,
చింతూరు , గంగవరం, నర్సీపట్నం, మాకవరపాలెం తో పాటు 26 మండలాల్లో వడగాలులు
వీస్తాయని IMD తెలిపింది.
ఏదైనా అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని, వెళ్లినా సరైన జాగ్రత్తలు
తీసుకోవాలని సూచించారు.ప్రజలు డీహైడ్రేషన్ కి గురి కాకుండా నీటిని
ఎక్కువగా తాగుతుండాలని తెలిపారు. కొబ్బరి బొండాలు, ఫ్రూట్ జ్యూస్లు తాగుతు
ఉండాలని చెబుతున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా వేడి తగలకుండా చల్లగా ఉండేందుకు
ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోవాలన్నారు.మరోవైపు రానున్న ఐదురోజుల
పాటు దేశంలో కూడా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగన్నాయని ఐఎండీ వెల్లడించింది.
దేశంలోని పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాలతోపాటు వాయివ్యంలోని కొన్ని చోట్ల 2
నుంచి 4 డిగ్రీ సెంటీగ్రేడ్ ల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ తెలిపింది.
రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్ , ఒడిశా మహారాష్ట్ర , ఛత్తీస్ గఢ్ లలో
ఉరుములు, బలమైన గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.