విజయవాడ : రాష్ట్రంలో మహ యజ్ఞంలా “జగనన్న నువ్వే మా నమ్మకం”కార్యక్రమం
జరుగుతోందని వైఎస్సార్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస కుమార్
అన్నారు. 2024 లో జరగబోవు ఎన్నికల్లో రెండోసారి ముఖ్యమంత్రి గా జగన్ మోహన్
రెడ్డినిర్ ముఖ్య మంత్రి గా ఎన్నుకోవాలని కోరారు ఇంటిటికి వెళుతున్న గృహ
సారథులను ప్రజలే మా ఇంటికి రండని స్వయంగా పిలిచి వాళ్ళ ఆనందాన్ని తెలియ
చేస్తున్నారని, జగనన్న ఇస్తున్న నవరత్నాల పథకాలు ప్రతి ఒక్కరి జీవితాలలో
వెలుగులు విరజిమ్మేలా ఉన్నాయని సంతోషంగా గృహ సారధులకు స్వాగతం పలుకు
తున్నారన్నారు. సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా పాలన అందిస్తున్నారని, ప్రతిపక్ష
పార్టీలు వాళ్ళ రాజకీయ ఉనికి కోసం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నారా
లోకేష్ పాదయాత్ర కు ప్రజల్లో స్పందన రాకపోవడంతో నిరాశ నిస్పృహలతో మాట్లాడు
తున్నారని, పాదయాత్రకు డబ్బులు ఇచ్చి జనాలను తీసుకు రాలేక జిల్లా స్థాయి
నాయకులు ముఖం చాటేశారని కొంత మంది నాయకులు తలలు పట్టుకుని లబోదిబో
మంటున్నారని, చంద్ర బాబు ఆశించిన స్థాయిలో లోకేష్ యాత్ర జరగడం లేదన్నారు.
ప్రజల్లో గందర గోళం సృష్టించ డానికి కరెంట్ చార్జీలు పెంచుతున్నారని టీడీపీ
నేతలు మాట్లాడుతున్నారని, టిడిపి పాలనలో హైదరబాద్ బషీర్ బాగ్లో జరిగిన
సంఘటన ఒక సారి గుర్తు చేసుకో వాలన్నారు. కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఉద్యమం
చేస్తున్న ఆందోళన కారులను గుర్రాలతో తొక్కించిన విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలు
మర్చిపోరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో అర్దం
కాక రాష్ట్ర ప్రజల్ని రెచ్చ గొడుతున్నారని, మరో సారి చంద్ర బాబుకి అధికారం
ఇవ్వడానికి సిద్ధంగా లేరని వైఎస్సార్ పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస కుమార్
తెలిపారు.