విజయవాడ : అవిభక్త భారతదేశంలో అంటరానితనం, అణచివేత, సామాజిక రుగ్మతలపై
పోరుసల్పిన తొలినాటి యోధుడు జ్యోతిరావు పూలే అని జన సేన అధ్యక్షుడు పవన్
కళ్యాణ్ అన్నారు. సామాజిక ప్రజాస్వామ్యం అనే నినాదాన్ని ఎలుగెత్తి చాటి
అటువంటి ప్రజాస్వామ్యం కోసం కలలుగన్న గొప్ప సంఘ సంస్కర్త పూలే. నేడు ఆ
మహానుభావుని జయంతి. ఆయన సేవా నిరతి, అణగారిన వర్గాల పట్ల ఆయనకున్న అవాజ్యమైన
ప్రేమాభిమానాలను మననం చేసుకుంటూ ఆ మార్గదర్శికి ప్రణామాలు
అర్పిస్తున్నానన్నారు. శతాబ్దం కాలం నాడు ఆచార వ్యవహారాలు, కుల వ్యవస్థతో
కూడిన ఛాందస భావాలు తీవ్రంగా ఉండేవని, అటువంటి పరిస్థితులలో కాలానికి,
సమాజానికి ఎదురెళ్లి సమాజంలో అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, ఐకమత్యం కోసం
పాటుపడిన ధీశాలి పూలే అని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు చదువు ఎంతో ముఖ్యమని నమ్మి
వారి విద్యాభివృద్ధికి అహరహం శ్రమించిన గొప్ప సంస్కర్త అని, వితంతువుల బిడ్డలు
అనాథలు కాకూడదని నమ్మి వారికి అండగా నిలబడిన నిస్వార్ధ సేవకుడు అని
కొనియాడారు. పూలు అమ్మే చిరు వ్యాపారిగా జీవితం ప్రారంభించి రచయితగా, తొలితరం
స్వతంత్ర యోధునిగా, కార్మిక ఉద్యమ నేతగా, రైతు బాంధవునిగా ఆయన ప్రజాజీవితం
అజరామరం అన్నారు. నేటి రాజకీయ పక్షాలు సైతం ఆయన చూపిన సామాజిక న్యాయం, సామాజిక
ప్రభుత్వం అనే మార్గంలో పయనించడం ఆయన దార్శనికతకు, ముందు చూపునకు
తార్కాణమన్నారు. జనసేన మూల సిద్ధాంతాలలో ఒకటైన ‘కులాలను కలిపే ఆలోచనా విధానం’
జ్యోతిరావు పూలే ఆలోచనలకు దగ్గరగా ఉండే సూత్రం అని, ఆ మహనీయుని అడుగుజాడలలో
జనసేన ప్రస్థానం కొనసాగుతుందని ఈ సందర్బంగా ఉద్ఘాటిస్తూ నా పక్షాన, జనసేన
శ్రేణులు పక్షాన ఆ చైతన్యమూర్తికి అంజలి ఘటిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.