స్టీల్ ప్లాంట్ సాధనలో అమరులైన వారి త్యాగాలు వృధా కారాదు
విభజన హామీలు నెరవేర్చలేని కేంద్రం రాష్ట్ర ప్రజల్ని మోసాగిస్తోంది
ప్లాంట్ ప్రరిరక్షణకు బిఆర్ఎస్ మహోద్యమానికి శ్రీకారం
దేశంలో బిజెపిని ఢీ కొట్టే ఏకైక నాయకుడు కేసిఆరే
త్వరలో విశాఖలో కెసిఆర్ తో భారీ భహిరంగ సభకు సన్నాహలు
ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్
విశాఖపట్నం : తెలుగువారి మనోభావాలను కించపరిచేలా కేంద్రంలోని బిజెపి
ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్ శక్తులకు దొడ్డిదారిన
కట్టబెట్టాలని చూస్తే భారత రాష్ట్ర సమితి మహాపోరాటానికి శ్రీకారం చుడుతుందని
ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్ఠం చేశారు. సోమవారం
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చేపట్టిన దీక్ష 788 రోజుకు చేరింది. దీక్షలో
పాల్గొన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు,కార్మికులకు సంఘీభావం తెలుపుతూ డాక్టర్
తోట దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడి ప్రభుత్వ
రంగా సంస్థ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను తన అనుయాయుడైన అదానికి దొడ్డి దారిన
దోచిపెట్టే కుట్రలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. ఉన్న స్టీల్ ప్లాంట్ ను
పరిరక్షించకుండా కడపలో కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ కు
సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్
ను ప్రైవేటీకరిస్తే ప్లాంట్ పై ఆధారపడి జీవించే లక్ష కుటుంబాలు రోడ్డున పడే
దుర్ధర పరిస్తితులు కేంద్రం కల్పించబోతోందని వాపోయారు. రాష్ట్రపతి పేరు
మీదున్న విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని ఆర్ఎన్ఎల్ కు బదిలీ చేయించాలని డిమాండ్
చేశారు. అమరావతి రాజధాని శంఖుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడి నిధులివ్వకుండా
గుప్పెడు మట్టి చెంబుడు నీళ్ళు తెచ్చారని ఎద్దేవా చేశారు. మోడి చేష్టలు
గమనించిన తెలంగాణ సిఎం కేసి ఆర్ తాను అమరావతి నిర్మాణానికి ఇవ్వాలనుకున్న
రూ.25 కోట్ల చెక్కును తిరిగి తీసుకెళ్లారని గుర్తుచేశారు. రూ.45 లక్షల
కోట్లున్న జాతీయ బడ్జెట్ నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఐదు వేలకోట్ల
నిధులు కేటాయించలేదా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ఆస్తులు కేంద్ర
ప్రభుత్వానివి కావు, బిజెపివి కావు అవి తెలుగు ప్రజల ఆస్తులని మోడి
గుర్తించాలన్నారు. కార్మికుల సమస్యలు సిఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని
ఇప్పటికే రాష్ట్ర హొంమంత్రి దృష్టికి తీసుకెళ్లమన్నారు. బిఆర్ఎస్ జాతీయ
అధ్యక్షులు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తెలంగాణా ప్రభుత్వం తరపున బిడ్
వేసేందుకు సిద్దమయ్యారని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు
బిఆర్ఎస్ కేంద్రాన్ని ఢీ కొట్టేందుకు వెనుకాడబోదని హెచ్చరించారు.
విశాఖనగరంలో త్వరలో బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసిఆర్ తో భారీ బహిరంగ సభ
నిర్వహించేలా పార్టీ శ్రేణులు సమాయత్తమౌతున్నాయన్నారు. బిజెపి హఠావో దేశ్
బచావో అంటూ దేశ ప్రజల్లో చైతన్యం మొదలైందని ఘాటుగా విమర్శించారు.బి ఆర్ ఎస్
రాష్ట్ర నేత, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్
పరిరక్షణకు కలసి వచ్చే ఏ పార్టీతో నైనా కలసి నడిచేందుకు తాము సిద్దంగా
ఉన్నామన్నారు. తొలుత విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలు తమ దీక్షకు
సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తోట చంద్రశేఖర్ కు ఘనస్వాగతం పలికారు. జై కేసీ
ఆర్ , జై తోట అనే నినాదాలతో దీక్ష శిబిరం వద్ద హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో
ఉక్కు పరిరక్షణ పోరాట సమితి అధ్యక్షుడు ఆద్దినారాయణ ,ఐ ఎన్ టి యు సి నేత
మంత్రి రాజశేఖర్, బి ఆర్ ఎస్ నాయకులు గాదె బాలాజీ , తలారి సురేష్, తాడువాక
రమేష్ నాయుడు, కారణం రామ్మోహన్ నాయుడు ,పెద్ద ఎత్తున బి ఆర్ ఎస్ శ్రేణులు ,
స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.