విజయవాడ : రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో
తాజ్ వివాంతా హోటల్ నందు ఈ రోజు వైద్యులకు నిరంతర వైద్య విద్యా కార్యక్రమం
జరిగింది. ఈ సదస్సులో రమేష్ హాస్పిటల్స్ గ్రూప్ నందు కల 32 మంది సూపర్
స్పెషాలిటీ వైద్య నిపుణులు తాము వైద్యం అందించిన అత్యంత క్లిష్టమైన కేసులకు
సంబంధించి విజయవంతంగా చికిత్స నిర్వహించిన వాటిని గుంటూరు, విజయవాడ, ఏలూరు
ప్రాంతాల నుంచి ప్రత్యక్షంగా హాజరయిన 380 మంది వైద్యులకు మరియు ఆన్ లైన్లో
రాష్ట్ర వ్యాప్తంగా హాజరయిన 200 మంది వైద్యులకు ఈ వైద్య విద్యా కార్యక్రమం
నందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్.పోతినేని రమేష్ బాబు
మాట్లాడుతూ అకస్మాత్తుగా సంభవించే గుండె పోటు మరణాలపై ప్రజలకు అవగాహన
కల్పించాలని గుండె పోటు ఆకస్మికంగా అప్పటి కప్పుడు రాదని, కొన్ని సంవత్సరాలకు
ముందే దానికి బీజం పడుతుందని, అది క్రమేపీ పెరిగి ఆకస్మికంగా గుండె పోటు
సంభవిస్తుందని దానిని ముందుగానే కనుగొనవలసిన బాధ్యత ఫ్యామిలీ డాక్టర్లు ,
కార్డియాలజిస్టుల పై ఎంతో ఉందని తెలియ చేసారు. సాంప్రదాయ పరీక్షలైన ఈ.సీ.జీ,
ఎకో, త్రెడ్ మిల్ పరీక్షల కంటే అత్యాధునికమైన క్యాల్షియం స్కోర్, సి.టి.కరొనరీ
యాంజియోగ్రామ్ పరీక్షా ఫలితాలు గుండె జబ్బు ప్రమాదాన్ని ముందే అంచనా
వేస్తున్నాయని వీటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని డాక్టర్ రమేష్ బాబు అన్నారు.
రమేష్ హాస్పిటల్స్ భాగస్వామ్య సంస్థ ఆస్టర్ డి.ఎం హెల్త్ కేర్ ఇండియా హెడ్
డాక్టర్.నితీష్ షెట్టి, ఆంధ్ర ప్రదేశ్ సీ.ఈ.ఓ దేవానంద్, రమేష్ హాస్పిటల్స్
చైర్మన్ మద్దిపాటి సీతా రామ్మోహనరావు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్.పావులూరి
శ్రీనివాసరావు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రెహమాన్,
సెక్రెటరీ డాక్టర్.దుర్గారాణి, మెడికల్ కౌన్సిల్ అబ్జర్వర్ డాక్టర్ సూరపనేని
సుధాకర్, ప్రముఖ ఎముకలు, కీళ్ల వైద్యనిపుణులు డాక్టర్ గుడారు జగదీష్
పాల్గొన్నారు.