విజయవాడ : నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అంటూ తనదైన సొంత
గొంతుకను శ్రీ శ్రీ వినిపించారని ఎ.పి.స్టేట్ మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీ,
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సి.ఇ.ఓ. ఎ.ఎమ్.డి ఇంతియాజ్ పేర్కొన్నారు.
పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం విజయవాడ లోని
కాన్ఫరెన్స్ హల్ (సెర్ప్ ) నందు శ్రీ శ్రీ జయంతి సందర్బంగా కవిసమ్మేళనం
జరిగింది. ఈసందర్బంగా ఇంతియాజ్ మాట్లాడుతూ పదండి ముందుకు, పదండి త్రోసుకు!
పోదాం పోదాం పైపైకి అనే ఆ సంకలన మకుట గీతం ఉడుకు నెత్తురు నవయువకులకు
స్ఫూర్తిదాయకమైందని వివరించారు. అనంతరం డాక్టర్ కొండూరు హరినారాయణ రెడ్డి
చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కొండూరు హరినారాయణ రెడ్డికి శ్రీ శ్రీ సాహిత్య సేవా
పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ
అధ్యక్షులు(2019) వేముల హజరత్తయ్య, అసోసియేషన్ అధ్యక్షులు కె.మురళీమోహన్ రాజు,
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత వెన్నా వల్లభరావు, తెలుగు లలిత కళా
పరిషత్తు గోళ్ళ నారాయణ రావు,దగ్గుపాటి రాధకృష్ణ, బి. కృష్ణయ్య, కవయిత్రి
రెజీనా, కావూరి సత్యవతి, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.