రంగ హత్య కేసు తిరిగి తెరిచ్చేలా హొంమంత్రి చొరవ చూపాలి * స్టీల్ ప్లాంట్
పరిరక్షణకు కు ప్రతిఒక్కరూ నడుం బిగించాలి *బిఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్
తోట చంద్రశేఖర్
కొవ్వూరు : పేదవారికి కష్టం వచ్చిందంటే తానున్నాని అండగా నిలిచిన దివంగత
వంగవీటి మోహనరంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని భారత రాష్ట్ర
సమితి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో 15 అడుగుల రంగా
విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది.విగ్రహాన్ని రాష్ట్ర హొంమంత్రి తానేటి వనిత
ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ తోట
మాట్లాడుతూ రంగా మరణించి 35 ఏళ్ళు గడచినా రంగాను ప్రజలు మరవలేదన్నారు. రంగా
పెరుచెప్పుకొని అనేక మంది నాయకులుగా ఎదిగి పదవులు అనుభవించారన్నారు.
ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు రంగా నామస్మరణ చేసే నాయకులు రంగా మృతికి కారకులైన
వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశించారు. రంగా పాశవికంగా హత్య కేసును
నీరుగార్చిన గత ప్రభుత్వ పెద్దలు రంగా పై అభిమాన ముంటే రంగా హత్య కేసును తిరగి
తెరవాలని డిమాండ్ చేశారు. అందుకు రాష్ట్ర హొం మంత్రి తానేటి వనిత చొరవ చూపాలని
కోరారు.ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న స్టీల్ ప్లాంట్ ను
ప్రైవేటీకరించేందుకు కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని
ఆరోపించారు.స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి 16500 కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు.
రంగా లాంటి ప్రజా నాయకుడుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా పరిష్కారం
లభించి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు .మూడు లక్షల కోట్ల విలువ గల స్టీల్
ప్లాంట్ ను అదానికి ధారాదత్తం చేసే కుట్రలను ఆంధ్రులందరూ పార్టీలకతీతంగా
అడ్డుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం స్టీల్
ప్లాంట్ ను పరిరక్షించుకోవాలనే చిత్తశుద్ది ఉంటే ఐదు వేల కోట్లు ప్లాంట్ కు
ఆర్ధిక ఋణ సాయం అందించి కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల
హక్కు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సి బాధ్యత పార్టీలపై ఉందన్నారు.
32 మంది ప్రాణ దానాల ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ తెలుగు వారి
మనోభావాలకు ప్రతీకగా నిలిచిందని ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలను
అడ్డుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో రంగా విగ్రహ దాతలు
బుజ్జి,కేశవ్ ,బండి అబ్బులు, జక్కంపూడి దత్తు, మద్దునూరు నాగరాజు,జక్కా
శ్రీనివాస్,ముక్కా శ్రీనివాస్ తదితర నేతలు,రంగా అభిమానులు.,కాపునేతలు
పెద్దఎత్తున హాజరయ్యారు