ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులతో ఆప్యాయంగా పలకరించి, వారి వివరాలు సేకరించి
నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
వారానికి ఒక మారు ఆరోగ్య కేంద్ర పరిధిలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య
సేవలు అందించాలి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్ భాష, నగర
మేయర్ కే సురేష్ బాబు
కడప : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్య, వైద్యా
ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు
సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనార్టీ
సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్ భాష, నగర మేయర్ కే సురేష్ బాబు సంయుక్తంగా
అన్నారు. కడప నగరపాలక సంస్థ, ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
పట్టణంలోని రవీంద్ర నగర్ పరిధిలో మోచంపేట, మారుతీ నగర్ పరిధిలో, ఫక్కీరు పల్లె
పరిధిలో నూతనంగా 3 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్ భాష, నగర మేయర్ కే. సురేష్ బాబు
చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్ భాష
మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి
విద్యకు వైద్యానికి వ్యవసాయానికి మూడు రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈ
ప్రభుత్వంలో ప్రతి పేదవానికి ఉన్నతమైన చదువులు చదివించాలనే ఆలోచనలో భాగంగా
విద్యకు పెద్దపీట వేయడం జరిగిందని, తద్వారా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం
కలిగించాలనే ఆలోచనలో భాగంగానే వైద్యా రంగానికి పెద్దపీట వేసిన పరిస్థితిని
చూస్తున్నామని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లోనే కాకుండా దేశవ్యాప్త
చరిత్రలో కూడా 40 వేల పైచిలుకు ఖాళీగా ఉన్న పోస్టులను వైద్య రంగంలో భర్తీ
చేసిన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ఈ సందర్భంగా
ప్రజలకు తెలియ చెబుతున్నానని అన్నారు. అందులో భాగంగానే 2 వేల జనాభా ఉన్న ప్రతి
గ్రామంలోనూ ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాలలో, అర్బన్‌లలో కూడా అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేయడం
జరిగిందని అన్నారు. గతంలో హెల్త్ సెంటర్లో ఒక డాక్టర్ కూడా ఉండేవారు కాదని
ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇద్దరు
ఎంబిబిఎస్ డాక్టర్లను నియమించడం జరిగిందని, ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ ను
కూడ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగిందని
తద్వారా ఇద్దరు ఎంబిబిఎస్ డాక్టర్లు ఒక డాక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో
ఉంటారని, మరో డాక్టర్ ఆ డాక్టర్ పరిధికి సంబంధించి క్షేత్రస్థాయిలో వెళ్లి
ఎవరైతే రోగులు ఉంటారో బెడ్ రీడన్ పేషంట్స్ ఉంటారో, సమీప ఆరోగ్య కేంద్రానికి
రాలేని రోగులు ఉంటారో ఒక టైం టేబుల్ ప్రకారం రోగి ఇంటికే వెళ్లి అక్కడే వైద్యం
అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మన
రాష్ట్రంలోనే ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రి ప్రారంభించడం
జరిగిందని, అన్ని ప్రాంతాల్లో కూడా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని
అన్నారు. అందులో భాగంగానే కడప నగరంలో గతంలోనే 4 అర్బన్ హెల్త్ సెంటర్స్
మాత్రమే అనేక సంవత్సరాలుగా ఉన్నాయని గమనించామని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కొత్తగా 9 అర్బన్ హెల్త్
సెంటర్లను కడప పట్టణంలో ప్రారంభం చేసుకోవడం జరుగుతోందని అన్నారు. వాటిలో
ప్రస్తుతం మూడు అర్బన్ హెల్త్ సెంటర్ లను ఈరోజు ప్రారంభం చేసుకోవడం
జరుగుతోందని చెప్పారు. ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో అన్ని మౌలిక సదుపాయాలను
ఏర్పాటు చేయడం జరిగిందని, 172 మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయని, 63 ల్యాబ్
టెస్టులు ఉచితంగా చేయడం జరుగుతుందని, ఇక్కడ ఒక ఎంబిబిఎస్ డాక్టరు, సుమారుగా
12 మంది పారా మెడికల్ సిబ్బంది ఈ అర్బన్ హెల్త్ సెంటర్ లో ఉండడం జరుగుతుందని
చెప్పారు. గత ప్రభుత్వంలో వైద్య రంగాన్ని వ్యాపార పరంగా మార్చి వేయడం
జరిగిందని, ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి
పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలనే ఆలోచనలో భాగంగా ఇలాంటి అర్బన్ హెల్త్
సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని అత్యాధునిక హంగులతో ప్రైవేటు కార్పొరేట్
ఆసుపత్రులకు ధీటుగా రూ.80 లక్షల ప్రభుత్వ నిధులు కేటాయిస్తే, మున్సిపల్
కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుండి రూ.15 లక్షల నుండి రూ. 16 లక్షల వరకు తీసుకొని
ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ కు రూ.95 లక్షలతో నూతనంగా రూపొందించి, నిర్మాణం
చేయడం జరిగిందన్నారు. కడప పట్టణంలో మోచంపేట, మారుతి నగర్, ఫక్కీర్ పల్లెలో
మూడు ప్రాంతాల్లో 3 అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభోత్సవం చేసుకోవడం ఎంతో
సంతోషకరమైన విషయమని అన్నారు. సదరు ప్రాంతాలలో ఎంతో పేదవారు నివసిస్తున్నారని
వారందరికీ అందుబాటులో అర్బన్ హెల్త్ సెంటర్ ఉంటుందని సదరు పరిసర ప్రాంతాలలో
ఉన్న పేదలందరూ ఈ అర్బన్ హెల్త్ సెంటర్లను వినియోగించుకోవాలని చెప్పారు. ఈ
అర్బన్ హెల్త్ సెంటర్లు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని
అన్నారు. ఇక్కడే ఒక డాక్టరు, 12 మంది సిబ్బంది ఉచితం గా వైద్య సేవలు
అందించి, ఉచితంగా నెలకు సరిపడే మందులు, ఉచితంగా రక్త పరీక్షలు చేయడం
జరుగుతుందని పేదలందరూ హెల్త్ సెంటర్ కు వచ్చి సేవలన్నీ సద్వినియోగం
చేసుకోవాలని తెలిపారు. రాబోవు రోజుల్లో కూడా ఇక్కడ ఉచిత వైద్య ఆరోగ్య
శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అవసరమైన డాక్టర్లను కూడా ఏర్పాటు చేసి ఈ
ప్రాంతంలోని పేద ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని
అన్నారు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలని ఆలోచనలతో భాగంగానే
ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులతో
ఆప్యాయంగా పలకరించి, వారి నుండి వివరాలు సేకరించి నాణ్యమైన వైద్య సేవలు
అందించాలని అన్నారు. అలాగే వారానికి ఒక మారు ఆరోగ్య కేంద్ర పరిధిలో వైద్య
శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని అన్నారు. మన రాష్ట్ర
ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని చెప్పారు.
నగర మేయర్ కే సురేష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
ప్రభుత్వంలో విద్య, వైద్యా ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసి పేద బడుగు
బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందని అన్నారు. దేశంలో
ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లోనే పేద ప్రజలు
ఆర్థికంగా సామాజికంగా ఉన్నతికి ఎదగాలని ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకెళ్తోందని
చెప్పారు. ప్రతి పేదవాడు సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్లను వినియోగించుకొని
ప్రయోజనం పొందాలని అన్నారు. అలాగే మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని
ఆశీర్వదించాలని చెప్పారు.
తొలుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్
భాష, నగర మేయర్ కే సురేష్ బాబు లకు పూల మాలలతో, బాణసంచాతో ఘనంగా అధికారులు
సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఆరోగ్య కేంద్రాలలో పూజలు నిర్వహించి రిబ్బన్
కత్తిరించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించి ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు. అలాగే
ఆరోగ్య కేంద్రంలోని సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు ఆదేశాలు చేశారు. ఈ
కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి.
అంజాద్ భాష, నగర మేయర్ కే సురేష్ బాబుతోపాటు నగర డిప్యూటీ మేయర్లు నిత్యానంద
రెడ్డి, ముంతాజ్ బేగం, కార్పొరేటర్లు అజమతుల్లా ఖాన్, బసవరాజు, షేక్ మహమ్మద్
షఫీ, పాకా సురేష్, నిరంజన్ రెడ్డి, కె. బాబు, రెడ్డి ప్రసాద్, జమాల్ బాషా, రామ
చంద్రయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే నాగరాజు, అదనపు డిఎం
అండ్ హెచ్ ఓ ఉమా మహేశ్వరరావు, నాయకులు తోట కృష్ణ, జయచంద్ర రెడ్డి, సుభాన్ భాష,
వైద్యులు వైద్యాధికారులు పాల్గొన్నారు.