ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు
నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా
ముగిశాయి. రాత్రి 7 గంటల నుండి అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణ ఘట్టం
నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల
దేవతలను సాగనంపారు.
బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో
తులతూగుతారని ఐతిహ్యం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నటేష్ బాబు, టెంపుల్
ఇన్స్పెక్టర్ ధనంజయులు పాల్గొన్నారు.