జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్
విజయవాడ : ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం మూడవరోజు 55వ డివిజన్
అధ్యక్షులు సోమీ గోవింద్ ఆధ్వర్యంలో స్థానిక నేత పల్నాటి ఆది పర్యవేక్షణలో
పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార
ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎర్రకట్ట శ్రీ కోదండ
రామాలయం వద్ద నుండి ప్రారంభమై సొట్ట అప్పారావు వీధి,తెల్లా వారి వీధి , తదితర
ప్రాంతాల్లో పర్యటించారు. కొంతమంది వృద్ధులకు వేలిముద్రలు పడకపోవడం వలన వారికి
పెన్షన్ నిలుపుదల చేయడంతో పాటు రేషన్ కార్డులు కూడా రద్దు చేయడం దుర్మార్గమని,
కొండ ప్రాంతాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, కొండ చర్యలు విరిగి పడుతున్న
రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం కనీస చర్యలు చేపట్టలేదని, వర్షాకాలంలో మట్టి
జారి పడుతుందన్నారు. ఎండాకాలంలో తాగునీరు సమస్య విపరీతంగా ఉందని, పంపులు
సకాలంలో రావడంలేదని, పగిలిపోయిన కాలువలకు కనీస మరమ్మత్తులు చేపట్టడం లేదని,
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఉపయోగంలోకి తెస్తే మురుగునీరు సమస్య
తగ్గుతుందని, సమస్యలు చెబుదామనుకుంటే స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేరని,
కనీసం కార్పొరేటర్ కైనా సమస్యల గురించి వివరిద్దామనుకుంటే వారు కొండ
ప్రాంతాలకు రాకుండా కిందకి వచ్చి వారికి కుదిరిన సమయంలో సమస్యలు చెప్పుకోమని
చెబుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియా పాయింట్ వద్ద మహేష్ మాట్లాడుతూ జగనన్నే మా నమ్మకం అనే మాట పచ్చి బూటకం
అని, మాయ ఇసక పాలసీ తీసుకురావడం వలన రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలకు ఉపాధి,
ఉద్యోగాలు లేక జగనన్నే మా దరిద్రం అని ప్రజలు తిడుతున్నారని, స్టిక్కర్లు
అంటించేందుకు ఎమ్మెల్యేలు మెడలో సంచులు వేసుకొని తిరగడానికి చూసి ప్రజలు
నవ్వుకుంటున్నారని వీరు పెద్దవాలంటీర్లు లాగా కనపడుతున్నారని, ఇంటింటికి
వెళ్లి జగనన్నే మా నమ్మకం అనే స్టిక్కర్లను వాలంటీర్లు ఎమ్మెల్యేలు అంటించిన
ప్రజలు వాటిల్ని పీకి పారేస్తారని, అతి తొందరలోనే వైసీపీ ప్రభుత్వాన్ని ఈ
రాష్ట్రం నుంచి పారద్రోలడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్
ప్రకటించిన మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలను మహేష్ ఇంటింటికి వివరించారు.
వాటిలో ప్రధానంగా బలమైన పారిశ్రామిక విధానం ద్వారా ఏటా ఐదు లక్షల ఉద్యోగాలను
కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ చర్యలు చేపడతారని ఉద్యోగులకు ప్రాధాన్యత
కల్పిస్తూ పాత పెన్షన్ అమలు అయ్యేందుకు కృషి చేస్తారని తెలియజేశారు. స్థానిక
డివిజన్ అధ్యక్షులు సోమీ గోవింద్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కు దమ్ము
ధైర్యం ఉంటే బ్యానర్లు పగలు మా ముందు తొలగించాలని, దొంగల్లాగా రాత్రిపూట
తొలగించడం పిరికి చర్య అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వెల్లంపల్లి
శ్రీనివాసరావుకు ఓటమి తధ్యమని, గెలిచేది పోతిన మహేష్ అని అన్నారు. ఈ
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ,రెడ్డిపల్లి గంగాధర్,
బత్తుల వెంకటేష్, సిగానంశెట్టి రాము, పొట్నరి శ్రీనివాసరావు, మల్లెపు
విజయలక్ష్మి ,తమ్మిన లీలా కరుణాకర్, ఏలూరు సాయి శరత్, గాదిరెడ్డి అమ్ములు,
సంజీవరావు, వెన్న శివశంకర్ , స్టాలిన్ శంకర్, బోట్టా సాయి, తదితరులు
పాల్గొన్నారు.