90 శాతం మంది కౌలురైతులకు రుణాలు అందించడం లేదు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
రైతులతో నారా లోకేశ్ ముఖాముఖి
అనంతపురం : టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కు విశేష స్పందన
వస్తోంది. పాదయాత్రంలో భాగంగా రైతులతో నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ
సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ వ్యవసాయరంగాన్ని జగన్ సర్కార్
పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. సీఎం జగన్ ఏపీని రైతులు లేని రాజ్యంగా
మార్చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో
స్థానం ఉందని తెలిపారు. ఒక్కో రైతుపై రూ.2 లక్షల అప్పుల భారం మోపారని
గుర్తుచేశారు. ఇప్పటికీ 60% మంది రైతులు సాగుపైనే ఆధారపడ్డారని, రైతు
బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆయన తెలిపారు. తాము అధికారంలోకి రాగానే రైతుల
సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతుల మనసు గెలిచాకే తలపాగా కడతామని
నారా లోకేశ్ ప్రకటించారు.
మరోవైపు దేశంలో రైతులపై అత్యధిక రుణభారం ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి రైతుపై సగటున రూ.2,45,554.00 అప్పు ఉన్నట్లు
కేంద్రమంత్రి భగవత్ రాజ్యసభలో వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో
అత్యధిక మంది ఆధారపడేది వ్యవసాయంపైనే. సాగు చేయాలంటే పెట్టుబడి కావాలి. గతంలో
సున్నా వడ్డీ, పావలా వడ్డీ పంట రుణాలు అందించేవారు. దీనివల్ల రైతన్నలకు వడ్డీల
భారం తగ్గేది. జగన్ సర్కారు పావలా వడ్డీ రుణాలకు మంగళం పాడేసింది. వడ్డీతో
సహా రుణం చెల్లిస్తేనే సున్నా వడ్డీ రాయితీ అని మెలిక పెట్టింది. దీంతో రైతుల
పై వడ్డీల భారం పడుతోంది. ఇక 90 శాతం మంది కౌలురైతులకు రుణాలు అందించడం
లేదన్నారు.
ఈ లెక్కన వైసీపీ ప్రభుత్వం వల్ల అన్నదాతలకు కొత్తగా ఒనగూరుతున్నదేమిటి అనే
ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కూడా చాలా
తక్కువ మందికి అందుతోంది. గత ప్రభుత్వంలో రాయితీపై సూక్ష్మపోషకాలు, విత్తనాలు,
ఎరువులు, యంత్రాలు, ఇలా అనేక రకాలుగా రైతాంగానికి లబ్ధి ఉండేది. ఇప్పుడు
రాయితీ పథకాలను అరకొరగా అమలు చేస్తున్నారు. కొన్ని పథకాలు ఉన్నాయో లేవో
రైతులకే తెలియని పరిస్థితి. ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఫల్యం వల్ల రైతులకు మేలు
జరగడం లేదు. వ్యవసాయానికి తగినంత ఊతం అందడం లేదు. ప్రభుత్వం పెట్టుబడి సాయం,
పరిహారం అరకొరగా ఇస్తూ చేతులు దులుపుకొంటోందని విమర్శించారు.
రైతుల మనసు గెలిచాకే అలా చేస్తా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు
గుప్పించారు. వ్యవసాయరంగాన్ని జగన్ సర్కార్ పట్టించుకోవట్లేదని, జగన్ ఏపీని
రైతులు లేని రాజ్యంగా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో
రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానం ఉందని, ఒక్కో రైతుపై రూ.2 లక్షల అప్పుల
భారం మోపారని లోకేష్ మండిపడ్డారు. ఇప్పటికీ 60 శాతం మంది రైతులు సాగుపైనే
ఆధారపడ్డారని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నారా లోకేష్ అన్నారు. మేం
అధికారంలోకి రాగానే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని, రైతుల మనసు గెలిచాకే
తలపాగా కడతానని నారా లోకేష్ స్పష్టం చేశారు. రైతులతో నారా లోకేశ్ ముఖాముఖిగా
మాట్లాడారు.
మరోవైపు జగన్ పేరు ఇప్పుడు చోర్ మోహన్ అని, సంక్షేమ కార్యక్రమాలు కట్
చేసిన వ్యక్తి చోర్ మోహన్ అని, జగన్ సర్కార్ రూ.10 ఇస్తూ రూ.100
దోచుకుంటోందని లోకేష్ ఆరోపించారు. రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది
టీడీపీనే అని లోకేష్ అన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు చోర్ మోహన్ చేసిందేమీ
లేదని మండిపడ్డారు. బీసీలకు జగన్రెడ్డి వెన్నుపోటు పొడిచారని, బీసీలపై అక్రమ
కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు
భద్రత కల్పించేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని, మోటార్లకు మీటర్లు పెట్టి
రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారని, రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ
జగన్ అని లోకేష్ వ్యాఖ్యానించారు.