విజయవాడ పశ్చిమ : దయచేసి వినండి మీ కోసం.. వినియోగదారుల శ్రేయస్సు కోసం ఈ
ప్రకటన. ఇదేదో బస్టాండ్ లోనో..లేదా రైల్వే స్టేషన్లలోనో వినిపించే ప్రకటన
కాదు. విజయవాడ పాతబస్తీలో ని వస్త్రలత వినిపిస్తున్న ప్రజా శ్రేయస్సు కోసం
మైకులో ప్రతిరోజూ మూడు సార్లు ఇదే మాట వినిపిస్తుంది. ఇటీవలే కరోనా కేసులు
దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు
అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించడంతో విజయవాడలో వస్త్రలత అసోసియేషన్
శనివారం నుండి తమ సామాజిక బాధ్యతగా తమ సందేశం మైకు ద్వారా
వినిపిస్తున్నారు.వినియోగదారులు,అలాగే వ్యాపారులు విధిగా మాస్కులు ధరించాలని
కరోనా నియంత్రణ చర్యలు అందరూ పాటించాలని వీరు మైకు ద్వారా ఉదయం మధ్యాహ్నం,
సాయంత్రం ఇలా మూడు పూటలా కరోనా నియంత్రణ జాగ్రత్తలు ప్రచారం చేస్తున్నారు.
వ్యాపారులు, వినియోగదారుల, ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ కలవడం జరుగుతున్న
దరిమిలా కరోనా వ్యాప్తికి దోహదపడుతుందని అందుకే అందరూ మాస్కులు ధరించాలని మైకు
ద్వారా చెప్పిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షులు ఓలేటి నరసింహరావు స్థానిక
విలేకరులతో చెప్పారు.