సర్వశిక్ష అభియాన్ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌గా బి. శ్రీనివాసరావు
తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా హరిత
నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా వికాస్ మర్మత్
అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా కొందరికి
అదనపు బాధ్యతలను అప్పగిస్తూ శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
గురువారం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం విదితమే. ఇంధన శాఖ
ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కె.విజయానంద్‌కు ట్రాన్స్‌కో
సీఎండీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. సర్వశిక్ష అభియాన్ అదనపు ప్రాజెక్టు
డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న ఎస్. సురేష్‌కుమార్‌ను
బదిలీ చేసి ఆ స్థానంలో బి. శ్రీనివాసరావును నియమించింది. ఐఏఎస్ అధికారి
వెట్రిసెల్విని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలంటూ గురువారం ఇచ్చిన బదిలీ
ఉత్తర్వులను నిలిపేసింది. ప్రసవ సెలవుపై వెళ్లిన నారపురెడ్డి మౌర్యను కర్నూలు
జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించింది. నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా
ఉన్న హరితను తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఆ స్థానంలో వికాస్
మర్మత్‌ను నియమించింది. బాపట్ల జాయింట్ కలెక్టర్‌గా సీసీఎల్ఏ జాయింట్
సెక్రటరీ (విజిలెన్స్)గా వ్యవహరిస్తున్న చామకూరి శ్రీధర్‌ను నియమించింది.
బాపట్ల జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌ను ప్రకాశం జిల్లా జేసీగా నియమించింది.