పట్టాలెక్కింది. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడవనున్న ఈ సెమీ హైస్పీడ్
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను శనివారం ప్రధాని నరేంద్ర మోడీ 10వ నంబర్
ప్లాట్‌ఫాంపై జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో రైల్వే శాఖ మంత్రి
అశ్వనీ వైష్ణవ్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని
శ్రీనివాస్‌యాదవ్ ఉన్నారు. ఈ రైలులో కొంతమంది విద్యార్థులు నల్గొండ వరకు
ప్రయాణిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని
నేరుగా వందేభారత్ రైలు ఎక్కారు. అక్కడ ఉన్న విద్యార్థులతో కాసేపు ఆత్మీయంగా
ముచ్చటించారు. అనంతరం జెండా ఊపి రైలును ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం
చేర్యాల పెయింటింగ్‌ను రైల్వే శాఖ మంత్రి ప్రధానికి అందించారు.
అంతకు ముందు ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి
చేరుకున్న ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై
సౌందరరాజన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్,
ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్
యాదవ్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమర్ స్వాగతం పలికారు. బేగంపేట
నుంచి ఎస్పీజీ దళాల ప్రత్యేక కాన్యాయ్ పర్యవేక్షణలో మోదీ సికింద్రాబాద్
రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడిచే (20701)
రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉదయం 6గంటలకు బయల్దేరి మధ్యాహ్నం
2.30గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు
స్టేషన్లలో ఆగుతుంది. అలాగే, తిరుపతి – సికింద్రాబాద్ (20702) రైలు తిరుపతి
రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు
సికింద్రాబాద్ చేరుకుంటుంది. మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు
సేవలందిస్తుంది.