విజయవాడ : భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) ఆలిండియా 7వ మహాసభలు తిరుపతిలో ఈ
నెల 16,17,18 తేదీల్లో జరుగుతున్నాయని ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.
పోలారి అన్నారు. ఆలిండియా మహాసభల గోడ పత్రిక ను క్రీస్తురాజపురంలోని
రామనర్సయ్య భవన్ లో ఇఫ్టూ నాయకులు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలారి
మాట్లాడుతూ కార్మిక చట్టాలను మార్చేసి లేబర్ కోడ్స్ తీసుకొచ్చి మోడీ సర్కారు
కార్మికుల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ఇఫ్టూ జాతీయ
మహాసభలు ఈ నెల 16,17,18 తేదీల్లో జరుగుతున్నాయని తెలిపారు.16 న తిరుపతి నగరంలో
కార్మిక ప్రదర్శన తిరుచానూరు రోడ్ లక్ష్మీ పురం సర్కిల్ నుండి
ప్రారంభమవుతుందని తెలిపారు. బహిరంగ సభ పద్మావతి పార్కు వద్ద జరుగుతుందన్నారు.
బహిరంగ సభలో కాకతీయ విశ్వ విద్యాలయం మాజీ ప్రొఫెసర్ కె. కాత్యాయని విద్మహే
ప్రధాన వక్తగా మాట్లాడతారని పేర్కొన్నారు. ఆలిండియా అధ్యక్షురాలు అపర్ణ,
ప్రధాన కార్యదర్శి బి.ప్రదీప్, కార్యదర్శి పి.ప్రసాదు, రాయలసీమ అధ్యయనాల సంస్థ
అధ్యక్షుడు భూమన్, హరికృష్ణ ఉపన్యాసకులుగా మాట్లాడతారని తెలిపారు.17,18
తేదీల్లో ప్రతినిధుల సభ ఎస్ ఎస్ బీ కల్యాణ మండపంలో
ప్రారంభమవుతుందన్నారు.జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం మాజీ ప్రొఫెసర్,
ఆర్థికవేత్త డాక్టర్ అరుణ్ కుమార్ ప్రారంభోపన్యాసం చేస్తారన్నారు. కార్మికుల
హక్కులు, సంక్షేమం కోసం మహాసభల్లో తగిన కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు.
గోడ పత్రిక ఆవిష్కరణ లో ఇఫ్టూ నగర అధ్యక్షుడు ముని శంకర్, నాయకులు డి.
శ్రీనివాసరావు, సీహెచ్.పెద్దిరాజు,డి. శ్రీధర్ బాబు, సీహెచ్. యాదగిరి, పి.రఫీ,
కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.