విజయవాడ : స్థానిక భవానిపురం 40వ డివిజన్ పున్నమి హోటల్ ఎదురుగా గల మహమ్మదియ
మసీద్ ప్రాంగణంలో వున్న మదర్సలోని బాడేమియా ఆద్వర్యంలో గురువారం ఇఫ్తార్
విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ముస్లిం సోదరులతో కలిసి మాజీ మంత్రి పశ్చిమ
నియోజకవర్గం శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక
ప్రార్దనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ ఉదయం నుంచి ఉపవాసం
వున్నా వారితో కలిసి ఇఫ్తార్ విందు పాల్గొనటం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి
ఏటా వస్తుంటాన్నారు.చాలా పవిత్రమైన ప్రదేశం అన్నారు. అల్లా ఆశీస్సులతో అందరూ
చల్లగా వుండాలన్నారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు డ్తెరెక్టర్ ఖాజా
40డివిజన్ కార్పొరేటర్ ,ఆంజనేయ రెడ్డి,41వ డివిజన్ కార్పొరేటర్ ఎం.డి
ఇర్ఫాన్,జిల్లా వక్ఫ్ బోర్డ్ గౌస్ మొహిద్దీన్,బడేఖాన్,క్వాలిటీ ఖాదర్,మదర్సా
పిల్లలు,మైనారిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.