నాయకులు, కార్యకర్తలు
పాదయాత్రలో నారా లోకేశ్ కు తప్పిన ప్రమాదం
ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అని టీడీపీ
జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పెన్నహోబిళం లక్ష్మి నరసింహ
స్వామి ఆలయం, సూర్యదేవాలయం ఉన్న పుణ్య భూమి ఉరవకొండ అన్నారు. అద్భుతాలు
సృష్టించే చేనేత కళాకారులు ఇక్కడ ఉన్నారు. రాష్టంలో ఎక్కడ లేని విధంగా ఈ
నియోజకవర్గంలో కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తాయని చెప్పారు. బుధవారం
ఉరవకొండ నియోజకవర్గం కూడేరు బహిరంగలో నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రమంతా
జగన్ ట్రాప్ లో పడినా మీరు మాత్రం జగన్ ట్రాప్ లో పడలేదని, ఉరవకొండ ప్రజలకు
నేను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. యువగళం పాదయాత్ర వైసిపి కి అంతిమ యాత్ర
అని, మీరు టిడిపి ప్రభుత్వం రావాలనే కోరుకున్నా కానీ బ్యాడ్ లుక్..తన్నే
దున్నపోతు ప్రభుత్వం వచ్చిందని, 30 రోజుల పాదయాత్ర పూర్తి అయ్యేసరికి జగన్ కి
జ్వరం వచ్చిందన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేష్ పాదయాత్రకు
ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్, టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘానా స్వగతం
పలికారు.
కర్ణాటకలో కేంద్రం నిర్మిస్తున్న ఎగువ భద్ర ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ
ఎడారిగా మారుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
రాయలసీమ బిడ్డనని చెప్పుకొనే సీఎం జగన్మోహన్రెడ్డి ఎగువ భద్రపై కేంద్ర
ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. హంద్రీనీవా, గాలేరు-నగరితో పాటు
సీమ ప్రాజెక్టుల కోసం తెదేపా ఐదేళ్లలో రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.
జగన్ ఈ నాలుగేళ్లలో కేవలం రూ.2,700 కోట్లు వ్యయం చేశారన్నారు. అన్నమయ్య
ప్రాజెక్టు గేట్ల మరమ్మతునూ పట్టించుకోలేదన్నారు. దీంతో ప్రాజెక్టు
కొట్టుకుపోయి 61 మంది చనిపోయారని గుర్తు చేశారు. రిలయన్స్, అమరరాజా, జాకీ
వంటి పరిశ్రమలను వెళ్లగొట్టి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారన్నారు.
పాదయాత్రలో నారా లోకేశ్ కు తప్పిన ప్రమాదం : టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం
పాదయాత్ర ఈరోజు రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో
కొనసాగింది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఆయన పాదయాత్ర ముందుకు సాగింది.
ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో లోకేశ్ కు ప్రమాదం తప్పింది. పాదయాత్ర సందర్భంగా
కూడేరులో టీడీపీ అభిమానులు లోకేశ్ ను గజమాలతో సత్కరించే సమయంలో ప్రమాదం చోటు
చేసుకుంది. భారీ గజమాలను క్రేన్ సహాయంతో లోకేశ్ కు వేసేందుకు ప్రయత్నిస్తున్న
సమయంలో క్రేన్ వైర్లు తెగాయి. దీంతో, మాల ఆయనపై పడింది. అయితే లోకేశ్ వెంటనే
అప్రమత్తమై తప్పించుకున్నారు. దీంతో, ఆయనకు ప్రమాదం తప్పింది. లోకేశ్ కు ఏమీ
కాకపోవడంతో అక్కడున్న టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.