రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్
కళ్యాణదుర్గం : అట్టడుగు వర్గాల అభ్యున్నతి ,అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం
నిరంతరం పోరాటం చేసి స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా తన పరిపాలనా
దక్షతతో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అఖండ భారతావనికి విశేష సేవలందించారని
రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ అన్నారు. మన భారత దేశ
మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బుధవారం
కళ్యాణదుర్గం పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి రాష్ట్ర స్త్రీ శిశు
సంక్షేమ శాఖ మంత్రి కే.వి.ఉషాశ్రీచరణ్ పులమాల వేసి ఘన నివాళి అర్పించారు.