విజయవాడ : మానవ ప్రయత్నాలకు దేవుని ఆశీస్సులు తోడైతే మంచి ఫలితాలు
ఉంటాయనడానికి జగనన్న సుపరిపాలనే నిదర్శనమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు,
సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా క్రిష్టియన్
మైనారిటీ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పాస్టర్ల అసోసియేషన్ సమావేశం అజిత్
సింగ్ నగర్లోని షాదీఖానా నందు మంగళవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ
మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ
సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా క్రిష్టియన్ మైనారిటీ విభాగానికి ఛైర్మన్ గా
ఎన్నికైన బందెల దయానందంకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రైస్తవ సంక్షేమానికి గత
నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు మల్లాది విష్ణు
వెల్లడించారు. పాస్టర్లకు ప్రతినెలా రూ.5 వేల గౌరవ వేతనాన్ని క్రమం తప్పకుండా
అందజేస్తున్నట్లు వివరించారు. అలాగే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే
విధంగా ఇటీవల అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగిందన్నారు. గతంలో ఏ
ప్రభుత్వం చేయని విధంగా క్రైస్తవులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అత్యంత
ప్రాధాన్యతను ఇస్తున్న సీఎం జగన్ కు అండగా నిలవాలని మల్లాది విష్ణు విజ్ఞప్తి
చేశారు. అనంతరం క్రైస్తవ సోదరులు మల్లాది విష్ణుని ఘనంగా సత్కరించారు.
తదననంతరం ఎన్టీఆర్ జిల్లా క్రిష్టియన్ మైనార్టీ సెల్ నియోజకవర్గ ఇంఛార్జిల
నియామకం జరిగింది. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, ఎన్టీఆర్
జిల్లా క్రిష్టియన్ మైనార్టీ సెల్ రీజనల్ కోఆర్డినేటర్లు కనపర్తి ప్రభాకర్,
బిషప్ రబ్బూని, ఎం.ఎలీషా, రవి బోస్, ఎం.ఆనందరావు, నాయకులు అఫ్రోజ్, గుండె
సుందర్ పాల్, పాస్టర్లు, క్రైస్తవ సోదరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.