గుంటూరు : వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. 12 మంది రీజనల్ కోఆర్డినేటర్లు
హాజరయ్యారు. ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న గడపగడపకూ మన ప్రభుత్వం, త్వరలో
చేపట్టబోయే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.
వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీలో అసంతృప్తులు, నేతల మధ్య
విభేదాలపైనా వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ చర్చిస్తున్నారు. పార్టీ
బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. సోమవారం
జరిగిన వైసీపీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం
ఉందన్న వార్తలపై సీఎం జగన్ రెడ్డి కుండబద్ధలు కొట్టారు. ముందస్తు ఎన్నికలు
లేవని ఏపీ ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఎన్నికలకు ఇంకా 14 నెలలు సమయం ఉందని
సీఎం జగన్‌రెడ్డి వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యేలకు, మంత్రులకు దిశానిర్దేశం
చేయడంతో ప్రస్తుతానికి సీఎం జగన్ రెడ్డికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన
లేదని స్పష్టమైంది.