కొత్త అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలి
బస్ పాస్ లను తక్షణమే మంజూరు చేయాలి
జర్నలిస్టుల సమస్యలపై పరిష్కారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుకు
ఏపీయూడబ్ల్యూజే వినతి
విజయవాడ : జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా
ఏపీయూడబ్ల్యూజే ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు
సమర్పించారు. విజయవాడ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
ఢిల్లీ రావుకు మంగళవారం ఆయన కాంప్ కార్యాలయంలో యూనియన్ నాయకులు కలిసి
వినతిపత్రం సమర్పించారు. వినతి పత్రాన్ని స్వీకరించిన తర్వాత కలెక్టర్ ఢిల్లీ
రావు మాట్లాడుతూ తప్పకుండా ప్రభుత్వం దృష్టికి జర్నలిస్టుల సమస్యలను
తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
కొత్త అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలని, బస్ పాస్ లను తక్షణమే మంజూరు చేయాలని,
అక్రిడేషన్ కమిటీలో యూనియన్స్ కు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ప్రతి
మండలంలో 100 పత్రికలు అనే నిబంధనలను అక్రిడేషన్ మంజూరుకు తొలగించాలని,
కొత్తగా ఇచ్చిన జీవోలో ఐటీ రిటర్న్స్ వంటి అసంబద్ధ నిబంధనలను తొలగించి కొత్త
జీవోను ఇవ్వాలని, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్
స్కీమ్ ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ ను కలిసిన వారిలో ఐజేయూ స్టీరింగ్ కమిటీ నాయకులు అంబటి ఆంజనేయులు,
ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు
జయరాజు, అర్బన్ నాయకులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, ఐజేయూ కౌన్సిల్ సభ్యులు
షేక్ బాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దాసరి నాగరాజు, దారం వెంకటేశ్వరరావు
తదితరులు పాల్గొన్నారు.