విజయవాడ : మోడీ, బిజెపి అవినీతి వ్యవహారాలను ప్రశ్నించకపోతే చివరకు మన వరకూ
వస్తారని, అప్పుడు అడిగేందుకు ఏమీ ఉండదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు
బి.వి.రాఘవులు హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న వైసిపి, టిడిపి, జనసేన ఎవరూ కూడా
బిజెపిని ప్రశ్నించడం లేదని అన్నారు. పైగా వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న
వనరులను అదానీ చేతిలో పెడుతోందని అన్నారు. గంగవరం పోర్టులో రాష్ట్ర వాటానూ
తాంబూలం ఇచ్చినట్లు ఇచ్చేశారని విమర్శించారు. పోలవరం నిధుల విషయంలో
డిమాండ్‌చేసి అడగాల్సింది పోయి కేంద్రం వద్ద అడుక్కునే పద్ధతిలో
వ్యవహరిస్తున్నారని ఇది సరైంది కాదని పేర్కొన్నారు. అలాగే ప్రతిపక్షాలపై
దాడులనూ జగన్, టిడిపి, జనసేన ప్రశ్నించలేదని, బిజెపికి అనుకూలంగా
వ్యవహరిస్తున్నారని ఇది రాష్ట్రానికి ప్రమాదకరమని తెలిపారు. ఇదే పద్ధతిలో
వ్యవహరిస్తే భవిష్యత్‌లో ప్రశ్నించేందుకు ఎవరూ మిగలరని, రాష్ట్రం అగాథంలోకి
వెళ్లిపోతుందని తెలిపారు. అలాగే అప్పుల కోసం జగన్ విద్యుత్ మీటర్లు
పెడుతున్నారని, బిజెపి పాలిత రాష్ట్రాలో తిరస్కరించినవాటిని ఇక్కడ అమలు
చేస్తున్నారని,
ఇంతకంటే లొంగుబాటు మరొకటి ఉండదని తెలిపారు. ఉత్పత్తి రంగం పూర్తిగా
దెబ్బతిందన్నారు. ఇది లేకపోతే యువత అన్యాయమైపోతుందని పేర్కొన్నారు.
ఫెడరలిజాన్ని దెబ్బతీస్తున్నారని, వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు.
చరిత్రను వక్రీకరిస్తున్నారని, మత ఘర్షణలు రేపుతున్నారని తెలిపారు. బీహార్,
హౌరాలో ఘర్షణలు ఇందులో భాగమేనని అన్నారు. ఈ చర్యలను ఇప్పుడు అడ్డుకోకపోతే 2024
ఎన్నికల తరువాత గుణాత్మకమార్పు వస్తుందని, అప్పుడు బిజెపి మరింత ప్రమాదకరంగా
వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో సిపిఎం, సిపిఐ ప్రచార కార్యక్రమం
చేపడుతున్నాయని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
సిహెచ్.బాబూరావు కూడా మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి
కాశీనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో వక్తలను బి.రమణ వేదిక మీదకు ఆహ్వానించారు.
నాయకులు డి.వి.కృష్ణ, శ్రీదేవి, సత్యబాబు, కృష్ణ, దుర్గారావు పాల్గొన్నారు.