పట్టుమని పాతికేళ్లు కూడా ఉండవు. అయినా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. 25–40
ఏళ్ల మధ్య వయసున్న వారిలో గుండెపోట్లు అధికంగా వస్తున్నాయని తాజా అధ్యయనాలు
ఘోషిస్తున్నాయి. గత పది సంవత్సరాల కాలంలో భారత్‌లో గుండె జబ్బులు 54 శాతం
పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సంస్థ వెల్లడించింది. భారత్‌లో
ఏటా సంభవించే మరణాల్లో 17 శాతం గుండె జబ్బుల కారణంగా జరిగేవే. దేశంలో 80 లక్షల
నుంచి కోటి మంది గుండెపోటు రోగులున్నారు. ఇది ప్రపంచంలో 40 శాతానికి సమానం.
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే 2000 సంవత్సరం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోనూ గుండె
జబ్బులు, గుండెపోట్లు ఎక్కువ అవుతూ ఉండటం. కార్డియాక్ అరెస్ట్ ప్రధాన
లక్షణాలు స్పృహ కోల్పోవడం, స్పందించకపోవడం. సీపీఆర్ తో పాటు, ఆకస్మిక
కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న రోగిని కూడా డీఫిబ్రిలేటర్, ఏఈడీ అని
పిలిచే చిన్న పరికరంతో పునరుద్ధరించాలి. అయినప్పటికీ కార్డియోపల్మోనరీ
రెససిటేషన్ (CPR) అనే ప్రక్రియ సహాయంతో ఒక వ్యక్తిని పునరుద్ధరించవచ్చు. ఇది
అత్యవసర ప్రాణాలను రక్షించే ప్రక్రియ మాత్రమే. అయితే సీపీఆర్ చేసే ప్రక్రియ
చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది కార్డియాక్ అరెస్ట్ తర్వాత జీవించే అవకాశాలను
రెట్టింపు లేదా మూడు రెట్లు పెంచుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం,
సీపీఆర్ రక్త ప్రవాహాన్ని చురుగ్గా ఉంచుతుంది. అంతేకాకుండా శిక్షణ పొందిన
వైద్య సిబ్బంది సైట్‌కు వచ్చిన తర్వాత విజయవంతమైన పునరుజ్జీవనం కోసం
అవకాశాన్ని విస్తరిస్తుంది.